AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి.. టీమిండియా శతృవుకి ఇచ్చిపడేసిన దాదా..!

Sourav Ganguly Shocking Comments on Greg Chappell: మైదానంలో ఎంతటి మొండి ఘటాలనైనా ఎదుర్కొనే ధీరత్వం సౌరవ్ గంగూలీ సొంతం. గ్రెగ్ చాపెల్ లాంటి వివాదాస్పద కోచ్‌లు తలపడినా.. తన ఆత్మగౌరవాన్ని, నిజాయితీని ఎక్కడా తాకట్టు పెట్టకుండా, కపట నాటకాలకు దూరంగా ఉండాలనే తన నైజాన్ని దాదా మరోసారి నిరూపించుకున్నారు. అందుకే క్రికెట్ అభిమానులు ఆయనను ఇప్పటికీ 'మహారాజా' అని పిలుచుకుంటారు.

Team India: వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి.. టీమిండియా శతృవుకి ఇచ్చిపడేసిన దాదా..!
Sourav Ganguly Shocking Comments On Greg Chappell
Venkata Chari
|

Updated on: Jun 24, 2026 | 8:51 PM

Share

Sourav Ganguly Shocking Comments on Greg Chappell: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యాయాల్లో ఒకటైన సౌరవ్ గంగూలీ, గ్రెగ్ చాపెల్ వైరంపై ‘దాదా’ మరోసారి పెను సంచలనం సృష్టించారు. టీమిండియాలో తన కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన చాపెల్, కొన్నేళ్ల తర్వాత మళ్లీ తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించారంటూ గంగూలీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఆ ఈమెయిల్ చూసి నా కళ్లను నేనే నమ్మలేదు..!

భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా సౌరవ్ గంగూలీ ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను పంచుకుంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. 2011 ఐపీఎల్ సీజన్‌కు ముందు గ్రెగ్ చాపెల్ నుంచి తనకు ఒక అనూహ్యమైన ఈమెయిల్ వచ్చిందని దాదా తెలిపారు. అప్పట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో, ఆ జట్టుకు ప్రధాన కోచ్‌గా రావాలని చాపెల్ ఆశపడ్డారట. అదీ గంగూలీ కెప్టెన్సీలోనే పనిచేసేందుకు ఆయన సిద్ధమయ్యారని తెలిసి గంగూలీ షాక్‌కు గురయ్యారు.

“ఆ రోజు ఉదయం ఇంగ్లాండ్‌లోని నా ఇంట్లో కూర్చుని ఈమెయిల్స్ చూసుకుంటున్నాను. అకస్మాత్తుగా గ్రెగ్ చాపెల్ పేరుతో ఒక మెయిల్ కనిపించింది. అది చూసి నేను ఇంకా నిద్రలోనే ఉన్నానా? కల కంటున్నానా? అనిపించింది. నా సారథ్యంలో కేకేఆర్ జట్టుకు కోచ్‌గా రావాలని ఆయన ఆ ఈమెయిల్లో కోరారు” అని గంగూలీ నవ్వుతూ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

నిజాయితీ లేని వారికి సమాధానం ఇవ్వను..

భారత క్రికెట్‌లో గంగూలీ కెప్టెన్సీని ఊడబీకడంలో చాపెల్ ఎంతటి వివాదాస్పద పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. చాపెల్ హయాంలోనే గంగూలీ జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో 2007 ప్రపంచకప్‌లో భారత్ ఘోర పరాజయం పాలై, మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించడంతో చాపెల్ కోచింగ్ అధ్యాయం ముగిసింది. అంతటి చేదు అనుభవాలను మిగిల్చిన వ్యక్తి నుంచి వచ్చిన ఈమెయిల్‌కు గంగూలీ స్పందించలేదు. “జీవితంలో నిజాయితీ లేని వ్యక్తులకు నేను ఎప్పటికీ సమాధానం ఇవ్వను. అందుకే ఆ మెయిల్‌ను పక్కన పడేశాను” అని దాదా ఘాటుగా సమాధానమిచ్చారు.

ఆస్ట్రేలియా కోచ్‌లతో ‘దాదా’కు తీరని చేదు అనుభవాలు..

గంగూలీకి కేవలం గ్రెగ్ చాపెల్‌తోనే కాదు, మరో ఆస్ట్రేలియా కోచ్ జాన్ బుకానన్‌తో కూడా తీవ్రమైన విభేదాలు వచ్చాయి. ఐపీఎల్ 2009 సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌గా ఉన్న బుకానన్.. ‘మల్టిపుల్ కెప్టెన్స్’ (బహుళ కెప్టెన్లు) అనే వింత సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి గంగూలీని కెప్టెన్సీ నుంచి తొలగించారు. దాదా స్థానంలో బ్రెండన్ మెకల్లమ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే, బుకానన్ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల ఆ సీజన్ లో కేకేఆర్ ఘోరంగా విఫలమై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ వైపు గంగూలీ అడుగులు?

క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. సౌరవ్ గంగూలీ త్వరలోనే ఐపీఎల్‌లో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఆయనను తమ క్రికెట్ విభాగాధిపతిగా నియమించుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో 2019లో కూడా గంగూలీ ఢిల్లీ జట్టుతో కలిసి పనిచేశారు. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ నాటికి ఈ బెంగాల్ టైగర్ మళ్లీ ఐపీఎల్ మైదానంలో వ్యూహాలు రచిస్తూ కనిపిస్తారేమో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!