AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: ‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది.. షూటింగ్ టైంలో ఎంతో ఎంజాయ్ చేశా: అలియా భట్

ఆర్ఆర్ఆర్ సినిమా హీరోయిన్ అలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆల్ఫా'. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుంది. జూలై 3 న ప్రపంచవ్యాప్తంగాథియేటర్లలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Alia Bhatt: ‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది.. షూటింగ్ టైంలో ఎంతో ఎంజాయ్ చేశా: అలియా భట్
Alia Bhatt
Basha Shek
|

Updated on: Jun 24, 2026 | 6:33 PM

Share

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రాబోతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆల్పా’. ఇండియాలో ఇది వరకెన్నడూ రానట్టుగా అలియా భట్, షర్వారిలతో భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని రూపొందించారు. ఆల్ఫా చిత్రం ఆటిట్యూడ్‌కు ఒక వేడుకగా, ప్రతీకగా నిలిచే ఓ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీ షూటింగ్, అందులోని క్షణాల్ని తాను ఎప్పటికీ మర్చిపోలేను అని అలియా భట్ అన్నారు. ‘ఆల్ఫా’ చిత్రానికి పని చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. నేను ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. యాక్షన్, గ్రాండియర్, అడ్వెంచర్‌లతో కూడిన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది నేను మునుపెన్నడూ అనుభవించని ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్. షూటింగ్‌లోని ప్రతీ క్షణాన్ని నేను ఎంతో ప్రేమించాను, ఆస్వాదించాను. ఈ చిత్రంలోని కథ ఇద్దరు మహిళ కథా నాయికల చుట్టే తిరుగుతుంది. అదే నాకు ఎక్కువగా నచ్చిన అంశం. ఇలాంటి గొప్ప స్క్రిప్ట్‌లు మనం అరుదుగా చూస్తుంటాం. ఈ ప్రయాణంలో భాగం అవ్వడం నాకెంతో సంతోషానిచ్చింది. ‘ఆల్ఫా’ అనేది ఆటిట్యూడ్‌కి, సెలెబ్రేషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇలాంటి ఓ అద్భుతమైన బృందంతో కలిసి పని చేయడం నాకు మరింత ప్రత్యేకంగా అనిపించింది’

‘మా దర్శకుడు, నటీనటులు, యాక్షన్ టీమ్, తెర వెనుక సిబ్బంది ఇలా అందరం కలిసి ఎంతో కష్టపడి ఉత్సాహంతో పని చేశాం. మా ఉత్సాహం అంతా కూడా తెరపై ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నాను. ప్రతి ఉదయం సెట్‌కు వెళ్లడానికి మనస్ఫూర్తిగా ఎదురుచూసేదాన్ని, చిత్రీకరణలోని ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాను’ అని అలియా భట్ చెప్పుకొచ్చారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో ‘ది రైల్వే మెన్’ ఫేమ్ శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ‘ఆల్ఫా’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఆల్ఫా సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కోజాగిరి పౌర్ణమి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే శుభమా? లక్ష్మీదేవి..
కోజాగిరి పౌర్ణమి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే శుభమా? లక్ష్మీదేవి..
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్
కెప్టెన్ కాకపోయినా నరేష్‌కు కెప్టెన్సీ రూమ్‌కు యాక్సెస్
కెప్టెన్ కాకపోయినా నరేష్‌కు కెప్టెన్సీ రూమ్‌కు యాక్సెస్
నమన్ ధీర్ దెబ్బకు టీమిండియాలో ముగ్గురికి టెన్షన్
నమన్ ధీర్ దెబ్బకు టీమిండియాలో ముగ్గురికి టెన్షన్
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. నవంబర్ 17 వరకు సెలవులు
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. నవంబర్ 17 వరకు సెలవులు
కేవలం 7 రూపాయల టికెట్.. కూలీ భార్యను కోటీశ్వరాలిని చేసిన అదృష్టం!
కేవలం 7 రూపాయల టికెట్.. కూలీ భార్యను కోటీశ్వరాలిని చేసిన అదృష్టం!
కోజాగిరి పౌర్ణమి.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు ఇలా పూజించండి
కోజాగిరి పౌర్ణమి.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు ఇలా పూజించండి
పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. విచిత్ర వీడియో వైరల్‌
పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. విచిత్ర వీడియో వైరల్‌
ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే?
ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే?
ఏపీలో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్.. ఇక భారీ వర్షాలే..
ఏపీలో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్.. ఇక భారీ వర్షాలే..