పక్కా బిజినెస్ మైండ్ కోతి బాసూ.. మొబైల్ ఇచ్చేందుకు కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే నవ్వు ఆపుకోలేరు!
ఇంటర్నెట్ ప్రపంచంలో కోతుల అల్లరి, చేష్టలకు సంబంధించిన వీడియోలకు కొదవ లేదు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కోతి వీడియో మాత్రం నెటిజన్లను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. సాధారణంగా కోతులు వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం, కానీ ఈ కోతి మాత్రం ఏకంగా స్మార్ట్‌ఫోన్‌ను దొంగిలించింది. దాన్ని తిరిగి ఇచ్చేందుకు ఓ రేంజ్‌లో 'బిజినెస్ డీల్' కుదుర్చుకుంది. ఈ వింత బేరసారాల వీడియో చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.

ఇంటర్నెట్ ప్రపంచంలో కోతుల అల్లరి, చేష్టలకు సంబంధించిన వీడియోలకు కొదవ లేదు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కోతి వీడియో మాత్రం నెటిజన్లను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. సాధారణంగా కోతులు వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం, కానీ ఈ కోతి మాత్రం ఏకంగా స్మార్ట్‌ఫోన్‌ను దొంగిలించింది. దాన్ని తిరిగి ఇచ్చేందుకు ఓ రేంజ్‌లో ‘బిజినెస్ డీల్’ కుదుర్చుకుంది. ఈ వింత బేరసారాల వీడియో చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక కోతి ఒక సామాన్యుడి మొబైల్ ఫోన్‌ను లాక్కొని హాయిగా ఇంటి పైకప్పు మీద కూర్చుంది. కింద ఉన్న జనం తమ ఫోన్‌ను ఎలాగైనా వెనక్కి తీసుకోవాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొందరు చేతులు ఊపుతూ సైగలు చేస్తుంటే, మరికొందరు ప్రేమగా బుజ్జగించడానికి చూస్తున్నారు. కానీ ఆ కోతి మాత్రం చాలా మొండిగా వ్యవహరించింది. ఫోన్‌ను పక్కన పెట్టుకుని, కింద జనం పడుతున్న పాట్లను చూస్తూ హాయిగా ఎంజాయ్ చేసింది. ఏమాత్రం లొంగకుండా తన పంతం నెగ్గించుకోవాలనే పట్టుదలతో కనిపించింది.
చాలా సేపటి వరకు ప్రజలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఉచితంగా ఫోన్‌ను తిరిగి ఇవ్వడానికి ఆ కోతి అస్సలు సిద్ధంగా లేదని అందరికీ అర్థమైపోయింది. ఈ క్రమంలో కింద ఉన్న ఒక వ్యక్తికి ఒక వినూత్నమైన ఉపాయం తట్టింది. కోతికి అత్యంత ఇష్టమైన ఒక టెట్రా ప్యాక్ ‘ఫ్రూటీ’ జ్యూస్‌ను దానికి చూపించాడు. అంతే.. జ్యూస్ ప్యాకెట్‌ను చూడగానే కోతి మైండ్ బ్లాక్ అయిపోయింది. దాని దృష్టి మొబైల్ నుండి ఒక్కసారిగా ఫ్రూటీ వైపు మళ్లింది.
ఆ తర్వాత జరిగిన సీన్ వీడియోకే హైలైట్‌గా నిలిచింది. కింద ఉన్న వ్యక్తి ఆ ఫ్రూటీని పైకి విసరగా.. కోతి దాన్ని అద్భుతంగా క్యాచ్ పట్టుకుంది. ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒప్పందం కుదరిందన్నట్లు తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను కిందకు పడేసింది. ఫోన్ దక్కగానే జనం ఊపిరి పీల్చుకోగా, అటు కోతి కూడా ఫోన్‌తో నాకేం పని అన్నట్లు హాయిగా ఫ్రూటీని ఆస్వాదించడం మొదలుపెట్టింది. ఈ మొత్తం హాస్యభరితమైన దృశ్యాన్ని డాక్టర్ సందీప్ అనే నెటిజన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా `@Dr_sandeep01` ద్వారా పంచుకున్నారు. “ఇది కోతి కాదు.. పక్కా బిజినెస్ మైండ్ ఉన్న కోతి” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కోతి బిజినెస్ డీల్ వీడియో ఇక్కడ చూడండి…
भाई! नीचे से फ्रूटी फेंको, तब जाकर तुम्हारा आईफोन वापस मिलेगा।
No Cash, Only Juice pic.twitter.com/nziD5yioy6
— Dr. Sandeep (@Dr_sandeep01) June 22, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
