Bigg Boss 8 Telugu: ఏడో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. ఓటింగ్‌లో నబీల్ టాప్.. డేంజర్ జోన్‌లో ఉన్నదెవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఉత్కంఠగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ షోలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నబీల్ అఫ్రిదీ అదరగొడుతున్నాడు. తన ఆట, మాట తీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ ఓటింగ్ లోనూ దూసుకుపోతున్నాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో ఏడో వారంలోకి ఎంటర్ అయ్యింది. పాత కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో గతంలో కంటే హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ బాగా పెరిగింది. ఇక ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ వాడి వేడిగా జరిగింది. ఏడో వారంలో ఏకంగా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి, నబీల్, టేస్టీ తేజ, నాగ మణికంఠ లు నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక వీరికి ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ కూడా ప్రారంభమయ్యాయి. గత రెండు వారాల్లాగే ఈ వారం కూడా నబీల్ ఓటింగ్ లో దూసుకపోతున్నాడు. ఇప్పటివరకు అతనికి సుమారు 19 శాతం ఓట్లు పడ్డాయి. ఇక రెండో ప్లేస్ లో కొనసాగుతోన్న నిఖిల్ కు 17 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇక హగ్గుల మణికంఠ బిగ్ బాస్ ఓటింగ్ లో మూడో ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు. ప్రేరణ సుమారు 13 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉండగా, పృథ్వీరాజ్ 8 శాతం, యష్మీ 5 శాతం , హరితేజ 7 శాతం ఓట్లతో వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. ఇక డాక్టర్ బాబు కు కేవలం ఐదు శాతమే ఓట్లు పడ్డాయి. అలాగే టేస్టీ తేజాకు కూడా తక్కువ ఓట్టు పడుతున్నాయి. వీరు చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. అండే ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో ఉన్నది వీరేనన్నమాట. అయితే ఓటింగ్ ప్రారంభమై కొన్ని గంటలు మాత్రమే గడిచింది. కాబట్టి పోనూ పోనూ ఇందులో మార్పులు కూడా సంభవించవచ్చు.
బిగ్ బాస్ లో అదరగొడుతోన్న నబీల్..
After an intense nomination round, it’s all fun and games in the Bigg Boss house! The contestants are back to enjoying light-hearted moments and creating memories together! 🤣🤣 #BiggBossTelugu8 #StarMaa #Nagarjuna @DisneyPlusHSTel @iamnagarjuna pic.twitter.com/cTNZL4Pn8K
— Starmaa (@StarMaa) October 16, 2024
ఏడో వారంలో ఏకంగా తొమ్మిది మంది నామినేషన్స్ లోకి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.