AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: కిచ్చా సుదీప్‌ బిగ్ బాస్ ను వీడడానికి కారణమదేనా? స్వయంగా క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో

తాను బిగ్ బాస్ హోస్ట్ చేయనని కిచ్చా సుదీప్ కొద్ది రోజుల క్రితం ప్రకటించాడు. సుదీప్ అనూహ్య ప్రకటన అతని అభిమానులను, బిగ్ బాస్ వీక్షకులను, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లను షాక్‌కు గురి చేసింది. ఇదే సందర్భంలో కొందరు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కూడా దీనిపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇదే విషయంపై  సుదీప్ స్వయంగా ఈ క్లారిటీ ఇచ్చాడు.

Bigg Boss: కిచ్చా సుదీప్‌ బిగ్ బాస్ ను వీడడానికి కారణమదేనా? స్వయంగా క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
Actor Kichcha Sudeep
Basha Shek
|

Updated on: Oct 16, 2024 | 7:41 AM

Share

కన్నడ బిగ్ బాస్ ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రారంభం నుంచి బిగ్‌బాస్‌కి కిచ్చా సుదీప్ నే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారు.. పోతున్నారు కానీ హోస్ట్ గా సుదీప్ ప్లేస్ మాత్రం మారలేదు. కన్నడలో బిగ్ బాస్ అంటే సుదీప్. సుదీప్‌ అంటే బిగ్‌బాస్‌ అని అక్కడి ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ నుంచి బిగ్ బాస్ హోస్ట్ చేయనని సుదీప్ అధికారికంగా ప్రకటించాడు. ఈ సంచలన ప్రకటనకు ఆయన సొంత కారణాలు ఉన్నాయి. అయితే కొందరు సుదీప్ ప్రకటనకు వేరే అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సుదీప్ మళ్లీ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. కిచ్చా సుదీప్‌ను కలర్స్ ఛానెల్, బిగ్ బాస్ నిర్వాహకులు అవమానించారని అందుకే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై సుదీప్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. “నా ట్వీట్‌ని చూసి, దానిని గౌరవిస్తూ వచ్చిన ప్రేమ, మద్దతును తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇది నిజంగా నాకు స్ఫూర్తినిస్తుంది. ఈ ప్రేమను, గౌరవాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’

‘ అయితే నాకు, కలర్స్ ఛానెల్ కు మధ్ విభేదాలు వచ్చాయని, ఆ ఛానెల్ నన్ను అగౌరవపరిచిందంటూ ప్రచారం చేసే వ్యక్తులకు నేను ఒక్కమాట చెప్పాలనుకుంటున్నాను. కలర్స్ ఛానెల్ తో నాది సుదీర్ఘమైన ప్రయాణం. బిగ్ బాస్ నుంచి ఎందుకు తప్పుకుంటున్నానో నా ట్వీట్ లో స్పష్టంగా, సూటిగా ఉంది. కలర్స్ ఛానెల్‌తో నా సంబంధం చాలా బాగుంది. వారు ఎల్లప్పుడూ నన్ను గౌరవంగా చూస్తారు. అలాగే వారి పట్ల నాకెంతో గౌరవం ఉంది. మా మధ్య విభేదాలున్నాయన్నది వట్టి అపోహ మాత్రమే. ‘నేను పనిచేస్తున్న టీమ్‌పై లేనిపోని ఆరోపణలు ఎదురవుతున్నప్పుడు చూస్తూ ఊరుకుని ఆనందించే వ్యక్తిని మాత్రం కాదు’ అంటూ సుదీప్ చెప్పుకొచ్చాడు.

అలాంటివి ప్రచారం చేయద్దు..

కిచ్చా సుదీప్ ట్వీట్.. ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..