Pallavi Prashanth: పుష్ప స్టైల్‌లో పోజులు ఇచ్చిన పల్లవి ప్రశాంత్ .. రైతులకు సాయంపై నిలదీసిన నెటిజన్స్

రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ తనకు వచ్చిన ప్రైజ్ మనీని అన్నదాతలకే పంచుతానిని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ ఏడో సీజన్ ముగిసి ఏడాది అవుతోంది. పైగా కొత్త సీజన్ కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ పల్లవి ప్రశాంత్ తన మాట నిలబెట్టుకోలేకపోయాడంటూ నెటిజన్లు రైతు బిడ్డను నిలదీస్తున్నారు.

Pallavi Prashanth: పుష్ప స్టైల్‌లో పోజులు ఇచ్చిన పల్లవి ప్రశాంత్ .. రైతులకు సాయంపై నిలదీసిన నెటిజన్స్
Pallavi Prashanth
Follow us
Basha Shek

|

Updated on: Oct 16, 2024 | 6:47 AM

రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు తెలంగాణ ప్రాంతానికి చెందిన పల్లవి ప్రశాంత్. ఎలాంటి అంచనాలు లేని దశ నుంచి ఏకంగా బిగ్ బాస్ ట్రోఫీని ఎగరేసుకునిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో రైతు బిడ్డకు బాగా క్రేజ్ పెరిగిపోయింది. అయితే బిగ్ బాస్ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, గొడవలతో అనూహ్యంగా జైలు పాలయ్యాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత బెయిల్ పై బయటి కొచ్చి మళ్లీ సోషల్ మీడియాలో బిజీ అయిపోయాడు. అలాగే పలు టీవీ షోల్లోనూ మెరుస్తున్నాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్ ప్రోగ్రాంలో యమా స్టైలిష్ గా కనిపించాడు పల్లవి ప్రశాంత్. ఏకంగా పుష్ప స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. పుష్ప రాజ్ తరహాలోనే భారీ గడ్డంతో కనిపించిన ఈ రైతు బిడ్డ స్టైలిష్ కోట్ తో, మీసాలు మెలేస్తూ తగ్గేదేలే అంటూ పోజులు ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. పుష్ప రాజ్ గా పల్లవి ప్రశాంత్ అదరగొట్టాడంటూ అతని ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు మాత్రం అతనిని ట్రోల్ చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన మాట ఏదయ్యా? లక్ష రూపాయల సాయం మర్చిపోతివా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రైతులకు ఇస్తానన్న పైసలేవి?

కాగా రైతు బిడ్డ ట్యాగ్ తోనే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. అదే ట్యాగ్ తో అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. బిగ్ బాస్ టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో తనకు అండగా నిలిచిన అన్నదాతలకు బిగ్ బాస్ ప్రైజ్ మనీని ఇస్తానంటూ హౌస్ లో ఉన్నప్పుడు, విజేతగా నిలిచినప్పుడు కూడా మాట ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోలేకపోతున్నాడని రైతు బిడ్డపై విమర్శలు వస్తున్నాయి. ఏదో ఒకటి, రెండు కుటుంబాలకు సాయం చేసి చేతులు దులుపుకున్నాడని, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, టీవీషోలతో రైతు బిడ్డ తీరిక లేనంత బిజీగా మారిపోయాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ