AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్..? ధోని దోస్త్ సంచలన వ్యాఖ్యలు

Badrinath Comments on Rishabh Pant: టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌లో 27 కోట్ల భారీ ధర పలికినప్పటికీ, వైట్ బాల్ క్రికెట్‌లో పంత్ స్థానం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసలు పంత్‌ను సెలెక్టర్లు కేవలం టెస్టులకే పరిమితం చేస్తున్నారా? మాజీ క్రికెటర్ బద్రీనాథ్ చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్..? ధోని దోస్త్ సంచలన వ్యాఖ్యలు
Badrinath Comments On Rishabh Pant
Venkata Chari
|

Updated on: Mar 18, 2026 | 2:43 PM

Share

Badrinath Comments on Rishabh Pant: భారత క్రికెట్ సంచలనం రిషబ్ పంత్ ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అతడిని రూ. 27 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, మైదానంలో ఆశించిన ప్రదర్శన కనబరచలేకపోతున్నాడు. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ మాట్లాడుతూ, పంత్ వైట్ బాల్ క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఐపీఎల్ 2025: పంత్‌కు ఒక పీడకల..

గత సీజన్ రిషబ్ పంత్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్, బ్యాటర్‌గా ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేసి, 25 కంటే తక్కువ సగటును నమోదు చేశాడు. టోర్నీ చివర్లో ఒక సెంచరీ సాధించినప్పటికీ, అది జట్టు విజయానికి పెద్దగా ఉపయోగపడలేదు. భారీ ధర, కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా పంత్ తన సహజసిద్ధమైన దూకుడును కోల్పోయాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సెలెక్టర్ల వ్యూహం: కేవలం రెడ్ బాల్‌కేనా?

బద్రీనాథ్ అభిప్రాయం ప్రకారం, భారత సెలెక్టర్లు ఇప్పుడు పంత్‌ను కేవలం ‘రెడ్ బాల్’ (టెస్ట్ క్రికెట్) ప్లేయర్‌గా మాత్రమే చూస్తున్నారు. టెస్టుల్లో పంత్ అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్ (ODI, T20) లో అతని స్థానం ఇప్పుడు గాలిలో దీపంలా మారిందని తెలుస్తోంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, కె.ఎల్. రాహుల్ వంటి సీనియర్లతో పాటు ధ్రువ్ జురెల్, జితేష్ శర్మ వంటి యువ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

తిరిగి రావడం సాధ్యమేనా?

“ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఉన్నంత కాలం పంత్ టీ20 జట్టులోకి రావడం కష్టం” అని బద్రీనాథ్ స్పష్టం చేశాడు. ఒకవేళ ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన చేస్తే తప్ప, వైట్ బాల్ జట్లలో పంత్‌కు చోటు దక్కడం అసాధ్యంగా కనిపిస్తోంది. పంత్ తన ఫామ్‌ను నిరూపించుకుని విమర్శకుల నోళ్లు మూయిస్తాడో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
జిమ్ మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
జిమ్ మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..