Radhika Apte: పెళ్లైన 12 ఏళ్లకు తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్‌తో రాధికా ఆప్టే సర్‌ప్రైజ్ 

బాలీవుడ్ లో బోల్డ్ అండ్ డేరింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాధికా ఆప్టే తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితమే. రక్త చరిత్ర, లెజెండ్, లయన్ తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అలాగే పలు హిందీ డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైంది.

Radhika Apte: పెళ్లైన 12 ఏళ్లకు తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్‌తో రాధికా ఆప్టే సర్‌ప్రైజ్ 
Radhika Apte
Follow us
Basha Shek

|

Updated on: Oct 17, 2024 | 8:04 PM

ప్రముఖ నటి రాధికా ఆప్టే శుభవార్త చెప్పింది. బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి మెప్పించిన ఈ అందాల తార త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. తాజాగా జరిగిన ఓ ఫిల్మ్ ఈవెంట్ లో బేబీ బంప్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చిందీ అందాల తార. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాధిక ‘BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024’ నుంచి తన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బేబీ బంప్ తో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాధికాకు ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాధిక నటించిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ UKలో ప్రీమియర్‌గా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆమె బ్లాక్ ఆఫ్ షోల్డర్ బాడీకాన్ డ్రెస్ తో అందంగా కనిపించింది. అదే సమయంలో బేబీ బంప్ తో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆమెకు విషెస్ తో ముంచెత్తారు. రాధిక బ్రిటీష్ వయోలిన్ విద్వాంసుడు, స్వరకర్త బెనెడిక్ట్ టేలర్‌ను 2012లో వివాహం చేసుకుంది. ఉత్తర ఇంగ్లండ్‌లో అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది.

సినిమాలతో బిజీ బిజీగ ఉండే రాధిక తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో లేదా మీడియా ముందు పెద్దగా చెప్పదు. అయితే ఒక సందర్భంలో తన పెళ్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది.. ‘ 10 సంవత్సరాల క్రితం (ఇప్పటికీ 12 ఏళ్లు) బెనెడిక్ట్, నేను వివాహం చేసుకున్నప్పుడు, మేము ఫోటోలు కూడా తీసుకోలేదు.మా పెళ్లికి కేవలం స్నేహితులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాం, మేము మేమే భోజనాలు తయారు చేశాం. పెళ్లి తర్వాత మేము పార్టీ చేసుకున్నాము. మా స్నేహితులు చాలా మంది ఫోటోగ్రాఫర్లు అయినప్పటికీ, ఎవరూ ఫోటోలు తీయలేదు’ అని రాధికా చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

బేబీ బంప్ తో రాధికా ఆప్టే..

View this post on Instagram

A post shared by Radhika (@radhikaofficial)

మరో సందర్భంలో పెళ్లి గురించి మాట్లాడుతూ ‘పెళ్లి అనే సంప్రదాయంపై నాకు పెద్దగా నమ్మకం లేదు. మేమిద్దరం కలిసి జీవించాలనుకున్నాం. కానీ వీసా విషయంలో చాలా సమస్యలు వచ్చాయి. పెళ్లి చేసుకోవడం వల్ల వీసా పొందడం సులువైంది. అందుకే పెళ్లి చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది.

భర్తతో రాధికా ఆప్టే..

View this post on Instagram

A post shared by Radhika (@radhikaofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం