వంటలక్క భర్త ఎవరో తెలుసా.. ? ఇద్దరూ ఎందుకు కలిసి ఉండరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
17 March 2026
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన సీరియల్ తారలలో ముందుగా వినిపించే పేరు వంటలక్క అలియాస్ దీప. అసలు పేరు మాత్రం ప్రేమి విశ్వనాథ్.
కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. సహజ నటనతో అడియన్స్ కు దగ్గరైంది. ఇప్పుడు కార్తీక దీపం 2లో నటిస్తుంది.
ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది వంటలక్క. అయితే తన ఫ్యామిలీ, భర్త, కొడుకు గురించి అంతగా తెలియదు.
ప్రేమీ విశ్వనాథ్ భర్త పేరు డాక్టర్ వినీత్ భట్. అతడు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందారు వంటలక్క భర్త.
తాను నటిగా ఇంతగా గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం తన భర్త వినీత్ భట్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది ప్రేమీ విశ్వనాథ్. తనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని తెలిపింది.
ఓవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో సక్సెస్ అవుతుంది ప్రేమి విశ్వనాథ్. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.50 కోట్లు అని తెలుస్తోంది.
అలాగే కేరళలో రెండు స్టూడియోస్ ఉన్నాయట. సినిమాలు, సీరియల్స్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆ స్టూడియోలో జరుగుతుంటాయని చెప్పుకొచ్చింది.
అలాగే తన భర్తతో తాను ఎక్కువగా కలిసి ఉండనని తెలిపింది. తాను సీరియల్స్ కోసం నిత్యం హైదరాబాద్ వస్తుంటానని.. అలాగే తన భర్త కూడా ఏదోక పనిపై బిజీగా ఉంటారని తెలిపింది.