Bigg Boss: బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. టెలికాస్ట్ ఆపేయాలని కోర్టులో పిటిషన్
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షోలు రన్ అవుతన్నాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఇప్పటికే ఆరు వారాలు గడిచిపోయాయి. ఏడో వారం ఎండింగ్ కు కూడా వచ్చేసింది.
కన్నడ టెలివిజన్‌లో అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. స్టార్ హీరో సుదీప్ ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 11 వ సీజన్ వరుసగా వివాదాలు ఎదుర్కొంటోంది. కొత్త సీజన్ ప్రారంభమై 19 రోజులు అవుతుండగా, ఇప్పటికే పలు కాంట్రవర్సీలు చోటు చేసుకున్నాయి. ‘బిగ్ బాస్’ హౌస్‌లో మహిళా కంటెస్టెంట్ల గోప్యతకు భంగం కలుగుతోందని మహిళా కమిషన్‌కు లేఖ ద్వారా ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. అలాగే ఈ షోలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ మేల్కొని ఈసారి నరకం-స్వర్గం అనే భావనకు స్వస్తి పలికి కంటెస్టెంట్స్ అందరూ ఒకే హౌస్ లో ఉండే అవకాశం కల్పించారు. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ టీమ్ కు మరో చిక్కు ఎదురైంది. బిగ్ బాస్ 11వ సీజన్ ప్రసారాన్ని శాశ్వతంగా ఆపేయాలంటూ సాగర్ అనే న్యాయవాది షిమోగా జిల్లాకు చెందిన గౌరవనీయమైన చీఫ్ కమర్షియల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కన్నడ కలర్స్ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 11కి వ్యతిరేకంగా షిమోగా జిల్లాకు చెందిన సాగర్‌కు చెందిన న్యాయవాది కెఎల్ భోజరాజ్ బిజినెస్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 39 రూల్ 1, 2 రెడ్‌తో సెక్షన్ 151 కింద ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. సివిల్ అండర్ సివిల్ కోసం న్యాయవాది కెఎల్ భోజరాజ్ దరఖాస్తును న్యాయమూర్తి చాందిని జి.యు స్వీకరించారు. విధాన నియమావళి చట్టం U/sec.26,order7,rule1 ప్రకారం కలర్స్ కన్నడ ఛానెల్ నిర్మాతలు, సంపాదకులకు అత్యవసర నోటీసును జారీ చేశారు. ఈ పిటిషన్ తదుపరి విచారణ అక్టోబర్ 28న జరగనుంది.
కాగా కన్నడలో బిగ్ బాస్ అంటే సుదీప్. సుదీప్ అంటే బిగ్‌బాస్ అని అక్కడి ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ నుంచి బిగ్ బాస్ హోస్ట్ చేయనని సుదీప్ అధికారికంగా ప్రకటించాడు. ఈ సంచలన ప్రకటన వెనక కారణాలేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
కన్నడ బిగ్ బాస్ హౌస్ లేటెస్ట్ ప్రోమో..
ನ್ಯಾಯ ಎತ್ತಿ ಹಿಡಿಯೋಕೆ ನಡೆದಿದೆ ಡಬಲ್ ಎಲಿಮಿನೇಷನ್!
ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ ಸೀಸನ್ 11 | ಸೋಮ-ಶುಕ್ರ ರಾತ್ರಿ 9:30#BiggBossKannada11 #BBK11 #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa pic.twitter.com/lFcPAYAlos
— Colors Kannada (@ColorsKannada) October 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.