Shekar Basha: షాకింగ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా అరెస్ట్! కారణమిదే

రాజ్ తరుణ్, లావణ్య కేసుతో బాగా పాపులరైన శేఖర్ బాషా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. తన కుళ్లు జోకులతో బిగ్ బాస్ ఆడియెన్స్ ను బాగానే నవ్వించాడు. అతని ఆటతీరు చూస్తే చాలా రోజుల వరకు హౌస్ లో ఉంటాడనిపించింది. అయితే అనూహ్యంగా రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు.

Shekar Basha: షాకింగ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా అరెస్ట్! కారణమిదే
Shekar Basha
Follow us
Basha Shek

| Edited By: TV9 Telugu

Updated on: Oct 22, 2024 | 12:59 PM

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్ ఆర్‌జే శేఖ‌ర్ బాషాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక కేసులో భాగంగా అతనిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సుమారు 4 గంటల పాటు శేఖర్ బాషాను విచారిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల యూట్యూబర్ హర్ష సాయి పై ఒక అమ్మాయి పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన‌పై లైంగికంగా దాడి చేయ‌డంతో పాటు మానసికంగా వేధించాడంటూ ఆ యువతి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్రయించింది. హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2కోట్ల తీసుకొని మోసం చేసినట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద హర్ష సాయిపై కేసులు నమోదు చేశారు. అయితే పోలీసు కేసు నమోదు అయినప్పటి నుంచి హర్ష సాయి కన్పించకుండా పోయాడు. హర్షసాయి విదేశాలకు వెళ్లాడనే తెలియడంతో అతని కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. అయితే ఇప్పుడిదే కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

హర్షసాయి కేసులో ఆర్జే శేఖర్ బాషా తల దూర్చాడని సమాచారం. పలు యూట్యూబ్ ఛానెల్స్ లో హర్ష సాయికి మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే బాధితురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శేఖర్ బాషాను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తొంది. కాగా గతంలో రాజ్ తరుణ్, లావణ్య కేసులో కూడా ఇలాగే ఇన్వాల్వ్ అయ్యాడు శేఖర్ బాషా. రాజ్ తరుణ్ కు మద్దతుగా మాట్లాడుతూ లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కారణంగానే ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో లావణ్య శేఖర్ బాషాను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది.

బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ బాషా..

nbsp;

బిగ్ బాస్ గ్యాంగ్ తో శేఖర్ బాషా.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!