హర్ష సాయి
హర్ష సాయి.. సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్ యువసామ్రాట్ అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. మాటలు చెప్పే నోళ్లు కాదు.. సాయం చేసే చేతులే మిన్న అనే కాన్సెప్టుతో నెట్టింట బాగా ఫేమస్ అయ్యాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే స్టంట్స్‌తో భారత్ దేశపు మిస్టర్ బీస్ట్‌గా గుర్తింపు సాధించాడు. ఇన్‌స్టాలో హర్ష సాయికి 14.3 మిల్లియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే.. అతని ఫేమ్ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. హర్ష సాయి సోషల్ మీడియాలో చేసే పోస్టులకు మిల్లియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్స్‌గా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన వ్యక్తిగా మారాడు.
అయితే ఇతగాడి నిజస్వరూపం కాస్త ఆలస్యంగా బయటపడటంతో ఫాలోయర్లే నోరెళ్ల బెడుతున్నారు. పెళ్లి పేరుతో మోసం చేశాడని, శారీరకంగా లొంగదీసుకున్నాడని, ఇదేమని అడిగితే బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని హర్షసాయిపై ఒక యువతి హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే తాను ఏ తప్పూ చేయలేదని.. తన నిజాయితీని కోర్టులో నిరూపించుకుంటానని చెబుతున్నాడు హర్ష సాయి. గతంలో ఆన్‌లైన్ గేమ్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా కూడా హర్ష సాయిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.