Harsha Sai: హర్ష సాయి పై మరో కేసు.. చాలా మంది బాధితులు ఉన్నారంటున్న లాయర్

హర్ష సాయి పై బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ బాధిత యువతి మూడు రోజుల క్రితం అత్యాచారం చేయడంతో పాటు నగ్నఫోటోలను, వీడియోలనుతీసి బ్లాక్ మెయిల్  చేస్తున్నాడని నార్సింగి పోలీస్‌లను ఆశ్రయించింది. బాధ్యత యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Harsha Sai: హర్ష సాయి పై మరో కేసు.. చాలా మంది బాధితులు ఉన్నారంటున్న లాయర్
Harsha Sai
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Sep 30, 2024 | 3:57 PM

లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పరారీలోనే ఉన్నాడు హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. హర్ష సాయి పై బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ బాధిత యువతి మూడు రోజుల క్రితం అత్యాచారం చేయడంతో పాటు నగ్నఫోటోలను, వీడియోలనుతీసి బ్లాక్ మెయిల్  చేస్తున్నాడని నార్సింగి పోలీస్‌లను ఆశ్రయించింది. బాధ్యత యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు ఆమె వద్ద నుంచి పలు ఆధారాలను సేకరించారు. అలాగే వైద్య పరీక్షల కోసం కొండాపూర్ లోఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

ఇది కూడా చదవండి :Geetha Govindam: వాయమ్మో..! ఈ చిన్నది గీతగోవిందంలో చేసిందా..! ఎంత మారిపోయింది

ఇదిలా ఉంటే ఒక సినిమా రైట్స్ కోసం హర్ష సాయి తనపై లైంగికంగా దాడి చేశాడని చెప్తుంది బాధిత యువతి అప్పటినుంచి అజ్ఞాతంలో ఉన్న హర్ష సాయి అతని కుటుంబ సభ్యులు ఇప్పటివరకు పోలీసుల కంట పడకుండా తిరుగుతున్నారు. తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్లో బాధిత యువతి మరొక ఫిర్యాదు చేసింది. తాను కేసు పెట్టినప్పటి నుంచి యూట్యూబర్ హర్ష సాయి తనను మరింత టార్చర్ చేస్తున్నాడని, మెయిల్స్ ద్వారా మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడంటూ గురువారం తను న్యాయవాదితో వచ్చి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.

ఇది కూడా చదవండి :Ranam : రణం బ్యూటీ రచ్చ రంబోలా..! ఈ ముద్దుగుమ్మ ఎంతలా మారిపోయింది.!!

యువతి ఫిర్యాదుతో మరో కేసు హర్ష సాయి మీద నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం హర్ష సాయి కోసం గాలిస్తున్నారు నార్సింగి పోలీసులు. కాగా యూట్యూబ్ హర్ష సాయికి సంబంధించిన బాధితులు చాలామంది ఉన్నారని ఆ యువతి తరపు అడ్వకేట్ అంటున్నారు. అలాగే హర్ష సాయి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ కూడా చేశాడంటూ గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఏపీలో దిశా యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న హర్షసాయిని తొలగించింది అక్కడి ప్రభుత్వం.

ఇది కూడా చదవండి : Tollywood : ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు.. కానీ వరుస ఆఫర్స్.. కారణం ఇదేనా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.