Devara Review: హిట్టా.? ఫట్టా.? ఎరుపెక్కిన సంద్రం నిలబడిందా.! రివ్యూ.

దేవర.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు.. మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. కల్కి తర్వాత విడుదలైన అతి పెద్ద సినిమా. జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా దేవర. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? కొరటాల ఆచార్య జ్ఞాపకాలను దేవర తుడిచేసాడా..? తారక్ నమ్మకాన్ని ఈయన నిలబెట్టాడా..? ఉన్నది ఉన్నట్టుగా.. ఈ పూర్తి రివ్యూలో చూద్దాం..

Devara Review: హిట్టా.? ఫట్టా.? ఎరుపెక్కిన సంద్రం నిలబడిందా.! రివ్యూ.

|

Updated on: Sep 27, 2024 | 4:15 PM

దేవర.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు.. మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. కల్కి తర్వాత విడుదలైన అతి పెద్ద సినిమా. జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా దేవర. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? కొరటాల ఆచార్య జ్ఞాపకాలను దేవర తుడిచేసాడా..? తారక్ నమ్మకాన్ని ఈయన నిలబెట్టాడా..? ఉన్నది ఉన్నట్టుగా.. ఈ పూర్తి రివ్యూలో చూద్దాం..

ఇక కథలోకి వెళితే.. ఎర్రసముద్రంలో దేవర అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ మాట శాసనం. నాలుగు ఊళ్ళకు ఆయన దేవర అంతే. వాళ్లకు సముద్రమే జీవనాధారం. ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డ్‌కు తెలియకుండా దించుతుంటారు. తన వాళ్ల కోసం ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం దేవరకు ఉంటుంది. అదే ఊళ్ళో భైర అలియాస్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఉంటాడు. దేవర చేసే పనులు భైరాకు నచ్చవు. కానీ దేవర సాయం లేకుండా ఏం చేయలేం అని భైరాకు తెలుసు. అందుకే అదును కోసం చూస్తుంటాడు. మరోవైపు తాము చేసేది తప్పు అని ఓ సమయంలో తెలుసుకున్న దేవర.. తన వాళ్లను కూడా సముద్రం పైకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. కానీ డబ్బులకు అలవాటు పడిన ఆ ఊరి వాళ్లు భైరా తోడుగా వెళ్దామని చూస్తారు. కానీ వెళ్లిన వాళ్లను సముద్రానికే అంకితమిస్తుంటాడు దేవర. కానీ కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా ఉండిపోతాడు దేవర. అంతటి ధైర్యవంతుడికి వర అలియాస్ ఎన్టీఆర్ లాంటి పిరికివాడు కొడుకుగా ఉంటాడు. అదే ఊళ్ళో ఉండే రాయప్ప అలియాస్ శ్రీకాంత్ కూతురు తంగం అలియాస్ జాన్వీ కపూర్ వరను ఇష్టపడుతుంటుంది. అసలు దేవర కొడుకు అయినా కూడా ఎందుకు వర అంత భయపడుతుంటాడు..? ఊరి వాళ్ల సమస్యలు దూరంగా ఉండే దేవర తీరుస్తుంటాడా..? అసలేమైంది.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..

కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. దేవరలోనూ ఇదే చెప్పాలని చూసాడు కొరటాల. ప్రతీ మనిషికి భయం అనేది కచ్చితంగా ఉండాలని.. అది లేకపోతే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అవసరం లేదనేది దేవర కథ. ఈ సింగిల్ లైన్‌పైనే సినిమా అంతా తీసాడు కొరటాల. అందులో కొన్ని ఎత్తులున్నాయి.. మరికొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. సినిమా మొదలవ్వడమే చాలా సీరియస్‌గా మొదలవుతుంది. తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్ నోట్‌లోనే తీసేకెళ్లిపోయాడు దర్శకుడు కొరటాల.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us