Pawan Kalyan: విజయవాడలో ‘హరిహర వీరమల్లు’ సెట్.! అన్ని సెట్ పవన్ రావడమే లేటు..
పవన్ కళ్యణ్ మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.ఏడాదిగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ మాత్రమే మిగిలిఉంది. దీంతో తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు పవన్‌కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పవన్ కళ్యణ్ మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.ఏడాదిగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ మాత్రమే మిగిలిఉంది. దీంతో తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు పవన్‌కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉన్న ఆయన సినిమా షూటింగ్‌కు తాజాగా సమయాన్ని కేటాయించారు. ఈనెల 23న విజయవాడలో ‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్ సహా కీలక నటీనటులు పాల్గొంటారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయనున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియాగా తెరకెక్కనున్న ఈ మూవీ ఈ ఏడాది చివరికి ప్రేక్షకుల ముందుకురానుంది. షూటింగ్ కోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో బ్లూమ్యాట్ సెట్‌ను సిద్ధం చేశారు. అందులోనే దర్శకుడు జ్యోతికృష్ణ ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో పవన్ కూడా సెట్‌లో అడుగుపెట్టనున్నారు. దీనికి తగ్గట్లుగానే మరోవైపు నిర్మాణానంతర పనుల్ని చకచకా పూర్తి చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్, బాబీ డియోల్...
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

