Social Media: తెలుగు స్టేట్స్‌లో హాట్‌టాపిక్‌గా.. ఇన్‌ఫ్లుయెన్సర్ల డర్టీ వేషాలు

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల డర్టీ వేషాలు.. తెలుగు స్టేట్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న హర్షసాయి ఇప్పటికే పరారీలో ఉండగా.. తాజాగా ఫేమస్‌ ఫోక్‌సింగర్‌ మల్లిక్‌ తేజ్‌పై రేప్‌ కేసు నమోదయింది. అతడితో పనిచేసిన ఓ యువతి.. మల్లిక్‌తేజ్‌ కంత్రీవేషాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Social Media: తెలుగు స్టేట్స్‌లో హాట్‌టాపిక్‌గా.. ఇన్‌ఫ్లుయెన్సర్ల డర్టీ వేషాలు
Harsha Sai Mallik Tej
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Sep 30, 2024 | 3:59 PM

సోషల్‌మీడియాలో కాస్త క్రేజ్ రాగానే కొంతమంది బుద్ధి..వక్రమార్గం పడుతోంది. కక్కుర్తి పనులు, చిల్లర వేషాలతో చేతులారా ఇమేజ్‌ డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌, యూట్యూబర్‌ హర్షసాయిపై రేప్‌ కేసులు సంచలనంగా మారితే..ఇప్పుడు ఇప్పుడు మరో కేసు తెరపైకి వచ్చింది. ఫోక్‌ సింగర్‌గా ఫేమస్ అయిన మల్లిక్‌ తేజ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఫోక్ సింగర్‌గా.. రైటర్‌గా..సాంస్కృతిక సారధి ఉద్యోగిగా మల్లిక్ తేజకు మంచి గుర్తింపు వచ్చింది. ఐతే మల్లిక్‌తేజ్‌ వెనుక తెలియని చీకటికోణం ఉందని ఆరోపిస్తోంది అతడితో పనిచేసిన ఓ యువతి. తనపై మల్లిక్‌ తేజ అత్యాచారం చేశాడని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను బ్లాక్‌మెయిల్‌ చేసి అత్యాచారం చేశాడని.. తన కుటుంబ సభ్యుల్ని కూడా దూషించాడని ఆరోపిస్తోంది బాధితురాలు. కొన్నేళ్లపాటు అతనితో కలిసి పనిచేశానని..ఈ క్రమంలో తనకు దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయని పోలీసులకు ఇచ్చిన కంప్లైట్‌లో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..పరారీలో ఉన్న మల్లిక్‌ తేజ కోసం గాలింపు చేపట్టారు.

ఇక అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేమస్‌ యూట్యూబర్‌ హర్షసాయి జాడమాత్రం పోలీసులకు ఇంకా చిక్కడం లేదు. మనిషి కన్పించడం లేదు కానీ..ట్వీట్లు, ఆడియో లీకులతో ఉనికి చాటుకుంటున్నాడు. క్రేజీ వీడియోలతో యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేసే హర్షసాయిపై రీసెంట్‌గా నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో రేప్‌ కేసు నమోదయింది. వీడియోలను అడ్డంపెట్టుకొని హర్షసాయి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. ఐతే అవన్నీ నిరాధార ఆరోపణలని కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని సోషల్‌మీడియాలో పోస్ట్‌పెట్టాడు హర్షసాయి. మరి అతడు చెప్పేది నిజమైతే పోలీస్‌ విచారణకు హాజరై నిర్దోసిత్వం నిరూపించుకోవచ్చు కదా..! ఈ దాగుడుమూతలెందుకు? అనే చర్చజరుగుతోంది. మరోవైపు ఎక్కడెక్కడో కలుగులో దాక్కున్న కేటుగాళ్లను ఈజీగా పట్టేస్తున్న పోలీసులు.. హర్షసాయిని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? అనే చర్చ జరుగుతోంది.

మరోవైపు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడన్న ఆరోప‌ణ‌లతో అరెస్టైన డ్యాన్స్‌మాస్టర్ జానీ.. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. నాలుగు రోజుల కస్టడీలో కేసుకు సంబంధించిన కీలక అంశాలను జానీ నుంచి రాబట్టారు..పోలీసులు. అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు రిమాండ్ ఖైదీగా కారాగారంలోనే ఉండనున్నాడు జానీ మాస్టర్. ఇప్పటికే జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాసిచ్చారు. దాని ఆధారంగానే రిమాండ్ విధించి జైలుకు తరలించాలని ఆదేశించింది కోర్టు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కోసం కస్టడీ సమయంలో పోలీసులు చేసిన ఇంటరాగేషన్‌..కేసును మళ్లీ మలుపు తిప్పింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక