Harsha Sai: కళ్లు కృష్ణుడిలా ఉన్నాయంటే.. మురిసిపోయిన హర్షసాయి.. ఆడియో వైరల్

యూట్యూబర్‌ హర్ష సాయి ఎక్కడ? మనిషి కన్పించడం లేదు కానీ ట్వీట్లు, ఆడియో లీకులతో ఉనికి చాటుకుంటున్నాడు. మరి హర్షసాయిని ఎందుకని అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? అనే చర్చ జరుగుతోంది. బాధితురాలు హైదరాబాద్‌ సీపీని కలిశారు. హర్షసాయి దేశం విడిచిపోకుండా చూడాలని ఫిర్యాదు చేశారామె. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసకోవాలని సీపీని కోరారు.

Harsha Sai: కళ్లు కృష్ణుడిలా ఉన్నాయంటే.. మురిసిపోయిన హర్షసాయి.. ఆడియో వైరల్
Harsha Sai
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Sep 30, 2024 | 3:57 PM

అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్‌ హర్ష సాయి ఎక్కడ? అజ్ఞాతం వెనుక అసలు కతేంటి?  బెట్టింగ్‌యాప్‌  గోతులు ఆరోపణలు ఎలా వున్నా క్రియేటివ్‌ వీడియోలతో నీతులు చెప్పే హర్షసాయికి ఆరోపణలు వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాలన్న విషయం తెలియదా? అన్నది బిగ్ క్వశ్చన్. క్రేజీ వీడియోలతో పాటు హర్షసాయిపై ఆరోపణలకు కొదవలేదు ఇక రీసెంట్‌గా నార్సింగ్‌ పీఎస్‌లో అతనిపై రేప్‌ కేసు ఫైలయింది. స్టోరీ డిస్కషన్‌ పేరిట ఇంటికి పిలిచి..మత్తు మందు కలిపిన డ్రింక్‌ ఇచ్చి..అత్యాచారం చేశాడని.. వీడియో రికార్డ్‌ చేశాడని  ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తీశారు. ఆ మూవీ కాపీ రైట్స్‌ కోసం పక్కా ప్లాన్‌తో  ఇవన్నీ చేశాడని.. వీడియోలను అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్నాడని ఆరోపించారామె.  ఐతే అవన్నీ నిరాధార ఆరోపణలు, కేవలం డబ్బు కోసమే చేస్తున్నారు సోషల్‌ మీడియాలో  ఓ పోస్ట్‌ పెట్టాడు. మరి అతను చెప్పిందే నిజమైతే  దాగుడుమూతలెందుకు? అనే చర్చ జరుగుతోంది.

అజ్ఞాతంలోకి వెళ్లడమంటే నేరానికి అర్ధాంగీకారం అంటారు. మరి హర్షసాయి అండ్‌గ్రౌండ్‌లోకి వెళ్లడం దేనికి సంకేతం.? ఐనా అతను దొరకట్లేదా? లేదంటే ఖాకీలు అతన్ని ట్రేస్‌ చేయలేకపోతున్నారా?..ఎనకటి రోజులు కావివి. ఏమూలన నక్కినా ఇట్టే పసిగట్టే టెక్నో పోలీసింగ్‌ ఉందిప్పుడు. రీసెంట్‌గా  లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్‌ చేసి తీసుకు వచ్చారు పోలీసులు. మరి హర్షసాయి విషయంలో ఎందుకని ఇంత జాప్యం?..పైగా హర్షసాయి సోషల్‌ మీడియోలు పోస్టులు, ఆడియో లీకులు ఇస్తూనే ఉన్నాడు. లేటెస్ట్‌గా మరో ఆడియో రిలీజ్‌ చేశాడు.

ఫిబ్రవరిలో ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రిలీజైంది. కళ్లు కృష్ణుడిలా వున్నాయన్న ఆమె కితాబుకు కితకితలాడిపోయి ఆ ఆడియోను భద్రంగా సేవ్‌ చేసుకున్నాడా? నేటి పొగడ్తే రేపటి తెగడ్త అవుతుందనే ముందు చూపుతోనా? ఆడియో ఫైల్స్‌ను అంత జాగ్రత్తగా చేసుకున్నాడంటే  కీడెంచి మేలెంచాలనే లైనా? ఏదైనా క్రిమినల్‌ ఇంటెన్షన్‌ వుందా? తనపై వచ్చిన ఆరోపణలు నిరాధరమైతే…తనకు తాను నిర్దోషిగా భావిస్తే ఎందుకని  ఈ దాగుడు మూతలు. ? అన్నది ప్రశ్నార్థకం.

కంప్లేంట్ ఇచ్చిన యువతితో కలిసి మెగాలో డాన్‌ అనే మూవీ చేసిన హర్షసాయి.. ఆమె ఇచ్చిన కంప్లేంట్‌ ఎదుర్కునేందుకు తన తరపున అడ్వోకేట్‌ చిరంజీవిని దింపాడు. కేవలం డబ్బు కోసమే ఆమె ఇదంతా చేస్తుందనేది హర్షసాయి అభియోగం.నిజంగా అది నిజమైతే.. మరి ఎందుకని ఫ్యామిలీకి ఫ్యామిలీ పరారయ్యారో పోలీసులే తేల్చాలి.

ఎక్కడో నక్కి పోస్టులు..ఆడియో లీకు ఇవ్వడం వెనుక హర్షసాయి స్ట్రాటెజీ ఏంటి? తను సీన్‌లోకి రాకుండా పోలీసులకు సవాల్‌ విసురుతున్నాడా? అడ్వోకేట్‌ అన్ని చూసుకుంటాడని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడంటే  డబ్బుంటే ఏదైనా చేయోచ్చని సభ్య సమాజానికి సందేశమిస్తున్నాడా? ఇలా అనేక రకాల చర్చలు జరుగున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా? మీ ఇంట్లో ఇది ఉండాల్సిందే..
వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా? మీ ఇంట్లో ఇది ఉండాల్సిందే..
చేపట్టిన పనిలో సక్సెస్ కోసం దసరా రోజున ఈ పరిహారాలు చేసి చూడండి
చేపట్టిన పనిలో సక్సెస్ కోసం దసరా రోజున ఈ పరిహారాలు చేసి చూడండి
ఆగివున్న గూడ్స్‌ రైలును వేగంగా ఢీకొన్న భాగమతి ఎక్స్‌ప్రెస్‌
ఆగివున్న గూడ్స్‌ రైలును వేగంగా ఢీకొన్న భాగమతి ఎక్స్‌ప్రెస్‌
పండుగైనా.. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..
పండుగైనా.. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..
నానో కారు తయారీకి అసలు కారణం ఇదా.. రతన్ టాటాకు హేట్సాఫ్..
నానో కారు తయారీకి అసలు కారణం ఇదా.. రతన్ టాటాకు హేట్సాఫ్..
Horoscope Today: ఖర్చుల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
Horoscope Today: ఖర్చుల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
ఇన్‌ఫినిక్స్‌ మరో అద్భుతం.. బడ్జెట్‌లో ఫ్లిప్‌ ఫోన్‌..
ఇన్‌ఫినిక్స్‌ మరో అద్భుతం.. బడ్జెట్‌లో ఫ్లిప్‌ ఫోన్‌..
మరింత అట్రాక్టివ్‌గా వాట్సాప్‌.. త్వరలోనే మరో స్టన్నింగ్‌ ఫీచర్‌
మరింత అట్రాక్టివ్‌గా వాట్సాప్‌.. త్వరలోనే మరో స్టన్నింగ్‌ ఫీచర్‌
సాబుదాన తింటున్నారా.? అయితే ఓసారి ఆలోచించుకోవాల్సిందే..
సాబుదాన తింటున్నారా.? అయితే ఓసారి ఆలోచించుకోవాల్సిందే..
గూడ్స్‌ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్‌.. రెండు బోగీల్లో మంటలు!
గూడ్స్‌ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్‌.. రెండు బోగీల్లో మంటలు!