Hyderabad: కలెక్టరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని..

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం.. తెల్లవారుజామున అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది.. తుపాకీ పేలిన శబ్దం రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది.. అప్రమత్తమై వెంటనే పరుగులు తీశారు.. ఏంటోనని చూడగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు..

Hyderabad: కలెక్టరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని..
Ranga Reddy News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 28, 2024 | 9:47 AM

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం.. తెల్లవారుజామున అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది.. తుపాకీ పేలిన శబ్దం రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది.. అప్రమత్తమై వెంటనే పరుగులు తీశారు.. ఏంటోనని చూడగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.. తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.. రంగారెడ్డి కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు అధికారులు తెలిపారు. బాలకృష్ణ కొంతకాలంగా రంగారెడ్డి కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు..

రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కలెక్టరేట్‌లో విధుల్లో ఉండగానే ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. బాలకృష్ణ కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బాలకృష్ణ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?