AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఛీ.. ఛీ.. ఇదేం పని.. పేరుకేమో ప్రిన్సిపల్‌… చేసేవన్ని..

హైదరాబాద్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్‌ ప్రభుదాస్ రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. ఫుడ్‌ కాంట్రాక్ట్‌కు సంబంధించి 29 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.

Hyderabad: ఛీ.. ఛీ.. ఇదేం పని.. పేరుకేమో ప్రిన్సిపల్‌... చేసేవన్ని..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Sep 28, 2024 | 11:53 AM

Share

హైదరాబాద్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్‌ ప్రభుదాస్ రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. ఫుడ్‌ కాంట్రాక్ట్‌కు సంబంధించి 29 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. స్కూల్ కు సంబంధించిన ఫుడ్ కాంట్రాక్టు విషయంలో అవకతవకలపై పలు ఫిర్యాదులు రావడంతో ప్రభుదాస్‌పై నిఘా పెట్టిన ఏసీబీ… లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్‌ చేసింది. ఇవాళ కోర్టులో హాజరుపర్చి.. రిమాండ్ కు తరలించనున్నారు.

మరోవైపు ఉప్పల్‌లోని ప్రభుదాస్ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో అక్రమస్తులను సైతం గుర్తించే అవకాశం ఉంది. ఒకవేళ అక్రమాస్తులను గుర్తిస్తే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

ఇక ప్రభుదాస్‌ అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఎన్నో దారుణాలకు ప్రభుదాస్ ఒడిగట్టాడు. స్కూల్ కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడమే కాకుండా నిధులను కొట్టేసేందుకు అనేక మార్గాలను ఎంచుకున్నాడు. స్కూల్లో పనుల కోసం టెండర్లను పిలిచినట్టే పిలిచి టెండర్ వేసే వారితో కుమ్మక్కయ్యి వారి నుండే డబ్బులు డిమాండ్ చేసి దోచుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్ ప్రభుదాస్ వ్యవహారంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో…నిఘా పెట్టి మరీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ప్రభుదాస్ తన చుట్టూ ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని తన ఆగడాలను ఎవరూ ప్రశ్నించకుండా అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. లక్షలకు లక్షలు నొక్కేయడమే కాకుండా… విక్టోరియా గర్ల్స్ ఎయిడెడ్ స్కూల్ కావటంతో అనాధ పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడన్నా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ దారుణాలపై త్వరలోనే స్థానిక పోలీసులకు విద్యార్థినులు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.

మరోవైపు విక్టోరియా స్కూల్‌ ఉపాధ్యాయులు ప్రభుదాస్‌ అరెస్ట్‌తో బయటకొస్తున్నారు. ఆయన ఆగడాలను బయటపెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా… బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న ప్రభుదాస్‌ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..