Harsha Sai: హర్షసాయి కేసులో షాకింగ్ విషయాలు.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి..
తమ న్యాయవాదులను సీన్‌లోకి దింపారు హర్షసాయి, బాధితురాలు. మూవీ డిస్కషన్ కోసం విల్లాకి పిలిచి రేప్ చేశాడంటోంది బాధితురాలు. కానీ ఆ అమ్మయే ప్రేమించాలని వేధించిందంటూ ఫోన్ ఆడియోలు బయట పెట్టాడు హర్షసాయి. పెళ్లి చూసుకుంటానని తనకు మోసం చేశాడని. అలాగే తన నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని బాధితురాలు చెప్తుంది.
యూట్యూబర్ హర్షసాయి కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. హర్షసాయి కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. తమ న్యాయవాదులను సీన్‌లోకి దింపారు హర్షసాయి, బాధితురాలు. మూవీ డిస్కషన్ కోసం విల్లాకి పిలిచి రేప్ చేశాడంటోంది బాధితురాలు. కానీ ఆ అమ్మయే ప్రేమించాలని వేధించిందంటూ ఫోన్ ఆడియోలు బయట పెట్టాడు హర్షసాయి. పెళ్లి చేసుకుంటానని తనకు మోసం చేశాడని. అలాగే తన నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని బాధితురాలు చెప్తుంది. కానీ హర్ష సాయి తనను ప్రేమిస్తున్నా అని ఆమె తనను వేదించిందని.. డబ్బు కోసం ఆమె ఇలా చేస్తుందని అంటున్నాడు హర్షసాయి. ఇక ఇద్దరి న్యాయవాదులు మాట్లాడుతూ షాకింగ్ విషయాలు బయట పెడుతున్నారు.
ఇది కూడా చదవండి : బాబోయ్..! ఏంటీ ఈమె మర్యాద రామన్న హీరోయినా..! ఎంత మారిపోయింది.!!
హర్షసాయి నగ్న వీడియోలు తీసి బెదిరించాడని బాధితురాలి న్యాయవాది నాగూర్‌బాబు అంటుంటే.. డబ్బు కోసమే ఆమె తప్పుడు ఆరోపణలు అంటోన్న హర్షసాయి న్యాయవాది చిరంజీవి అంటున్నారు. ఇక హర్షసాయి కేసులో కీలక విషయాలు బయటపెట్టారు బాధితురాలి న్యాయవాది నాగూర్‌బాబు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేయడమే కాకుండా వీడియో రికార్డు చేశాడని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!
బాధితురాలు చెప్పేవన్నీ అబద్ధాలే అంటున్నారు హర్షసాయి న్యాయవాది చిరంజీవి. ఆమే.. హర్షసాయిని, అతని తండ్రిని వేధించిందని కౌంటర్ ఇచ్చారు. డబ్బుకోసమే ఆమె ఇలా చేస్తుందని అన్నారు. ఇదే సమయంలో హర్ష సాయి ఫోన్ ఆడియోలు బయట పెట్టాడు. ఈ ఆడియోలో ఓ యువతీ తనను ప్రేమించమని అడుగుతుంది. ఈ ఆడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.