Harsha Sai: యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌ తప్పదా.?

Harsha Sai: యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌ తప్పదా.?

Anil kumar poka

|

Updated on: Oct 07, 2024 | 12:00 PM

యూ ట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. చిక్కడు దొరకడు తరహాలో యూట్యూబర్‌ హర్షసాయి దాగుడు మూతలు ఆడుతున్నాడు. అత్యాచారం కేసు నమోదయినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని జాడ కోసం నార్సింగి పోలీసులు స్పెషల్‌ టీమ్స్‌ను రంగంలోకి దించారు. హర్షసాయి విదేశాలకు పారిపోయే అవకాశం వుందని బాధితురాలు పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు.

యూ ట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. చిక్కడు దొరకడు తరహాలో యూట్యూబర్‌ హర్షసాయి దాగుడు మూతలు ఆడుతున్నాడు. అత్యాచారం కేసు నమోదయినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని జాడ కోసం నార్సింగి పోలీసులు స్పెషల్‌ టీమ్స్‌ను రంగంలోకి దించారు. హర్షసాయి విదేశాలకు పారిపోయే అవకాశం వుందని బాధితురాలు పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. లైంగిక దాడి.. అండ్‌ బ్లాక్‌మెయిలింగ్‌ కేసులో యూట్యూబర్‌ హర్షసాయి కోసం నార్సింగి పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో యూ ట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మరో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

విదేశాలకు పారిపోయినా సరే హర్షసాయి అరెస్ట్‌ తప్పదన్నారు బాధితురాలి తరపు న్యాయవాది నాగూర్‌ బాబు. ఇక నిందితురాల్ని డిఫేమ్‌ చేసేలా హర్షసాయి అతని మనుషులు రిలీజ్ చేసిన ఫ్యాబ్రికేటెడ్‌ ఆడియోలపై కోర్టును ఆశ్రయించామన్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి వాటిని తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు డైరెక్షన్‌ ప్రకారం సైబర్‌ క్రైమ్‌ సెక్షన్ల కింద పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయిందన్నారు నాగూర్‌బాబు. తన క్లయింట్‌పై ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు హర్షసాయి ప్లాన్‌లో భాగమన్నారు. కేసులో నిందితుడిగా చేర్చకపోయినా సరే హర్షసాయి తండ్రి బెయిల్‌ కోసం ప్రయత్నించారన్నారు. దీంతో కోర్టు అతన్ని మందలించిందన్నారు. హర్షసాయి కోసం పోలీసులు లుక్‌ ఔట్‌ నోటీస్‌ జారీ చేశారని.. అరెస్ట్ తప్పదన్నారు.

యూట్యూబర్ హర్షసాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు, ఫొటోలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడంటూ ఓ సినీ నటి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అప్పటినుంచి హర్షసాయి పరారీలోనే ఉన్నాడు. నార్సింగ్‌ పీఎస్‌లో రేప్‌ కేసు ఫైలయినప్పటి నుంచి హర్షసాయి జాడ లేదు. విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడని ఇప్పటికే ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా మరో కంప్లయింట్ చేశారు. సోషల్‌ మీడియాలో తనను ట్రోల్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ క్రమంలో పలువురిపై సైబర్‌ క్రైమ్‌ సెక్షన్స్‌ కింద కేసు ఫైలయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 07, 2024 11:55 AM