Swag Review: హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాది మార్చిలో ఓం భీమ్ బుష్ సినిమాతో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు స్వాగ్ అంటూ మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది. శ్రీ విష్ణు కెరీర్లో స్వాగ్.. మంచి సినిమాగా లిస్టవుతుందా? లేదా తేలిపోతుందా? తెలియాలంటే ఈ రివ్యూ పై ఓ లుక్కేయండి.!
ఇక స్వాగ్ కథలోకి వెళితే.. దివాకర్ పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవనభూతి అలియాస్ శ్రీవిష్ణు రిటైర్మెంట్ రోజు అతనికి ఒక లెటర్ వస్తుంది. అందులో తనది శ్వాగనిక వంశం అని.. వంశ వృక్ష నిలయంలో పూర్వికుల ఆస్తి ఉందని తెలుస్తుంది. ఎలాగైన ఆ ఆస్తినికి కొట్టేయాలని భవనభూతి అక్కడికి వెళ్తాడు. ఆ ఆస్తికి రక్షగా నిలుస్తున్న మరో వంశం వ్యక్తి.. పూర్వికులు ఇచ్చిన పలక తీసుకొని వస్తేనే ఆస్తి దక్కుతుందని చెబుతాడు. భవనభూతి దాని వెతుకుతుండగా..మరో యువతి అనుభూతి అలియాస్ రీతువర్మ ఆ పలకతో వంశవృక్ష నిలయానికి వస్తుంది. శ్వాగనిక వంశం తనదే అంటే తనదే అంటూ ఇద్దరు గొడవపడుతుంటారు. మరోవైపు యూట్యూబర్ సింగ అలియాస్ మరో శ్రీవిష్ణువు కూడా స్వాగనిక వంశం వాడేనని తెలుస్తుంది. ఆయన కూడా ఆస్తికోసం వంశ వృక్ష నిలయానికి వస్తాడు. అసలు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధ ఏంటి? వీరికి లేఖలు రాస్తున్నదెవరు? ఎందుకు రాశారు? 1550లో మాతృస్వామ్య పాలన సాగిస్తున్న వింజారమ వంశపు స్త్రీ అలియాస్ రితూ వర్మ నుంచి స్వాగనిక వంశ మూలపురుషుడు భవభూతి అలియాస్ శ్రీవిష్ణు అధికారాన్ని ఎలా దక్కించుకున్నాడు? మాతృస్వామ్య పాలనకు ముగింపు పలికి పితృస్వామ్య పాలన ఎప్పటికీ కొనసాగించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇప్పుడీ కథ వింటేనే గందరగోళంగా ఉంది కదా..! కానీ చూడడంలో మాత్రం ఎలాంటి గందరగోళం లేకుండా చాలా క్లారిటీగా తీయడంలో సగం మాత్రమే సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ హసిత్ గోలి. డిఫరెంట్ టైం లైన్స్‌లో సెట్ చేసిన ఈ కథను.. బాగానే డీల్ చేశాడు. సినిమా స్టార్టింగ్‌లో కాస్త కన్ఫూజన్.. బుర్ర పెట్టి ఆలోచిస్తే తప్ప అర్థం కాకుండా ఉన్న క్యారెక్టర్స్ మధ్య లింక్స్! ఇవి వదిలిపెడితే సినిమా మాత్రం ఎక్కడా ఆగకుండా వెళుతుంది. అయితే 1550ల నాటి కథకి ఇప్పటి వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి అనేది బుర్రపెట్టి చూస్తే తప్ప అర్థం కాదు. అయితే ఉన్న కొద్ది సమయంలో దర్శకుడు అందరికి అర్థమయ్యేలా కథను చెప్పడం గ్రేట్. కానీ బుర్ర పెట్టని వాడికి మాత్రం అదో గందరగోళంలా అనిపిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.