Anupam Kher: ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫోటో.! వైరల్..
దేశవ్యాప్తంగా ఫేక్ కరెన్సీ కలకలం రేపుతోంది. కేటుగాళ్లు నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణీ చేస్తున్నారు. అయితే వీరిని పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతోంది. అయితే నకిలీ నోట్లకు సంబంధించిన ఒక ముఠాను తాజాగా అహ్మదాబాద్ పోలీసులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దేశవ్యాప్తంగా ఫేక్ కరెన్సీ కలకలం రేపుతోంది. కేటుగాళ్లు నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణీ చేస్తున్నారు. అయితే వీరిని పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతోంది. అయితే నకిలీ నోట్లకు సంబంధించిన ఒక ముఠాను తాజాగా అహ్మదాబాద్ పోలీసులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ముఠా దగ్గరున్న నోట్లను చూసి అధికారులు షాక్ అయ్యారు. ఫేక్ నోట్ల ముఠా వద్ద దొరికిన 5 వందల రూపాయల నోట్లలో మహాత్మ గాంధీకి బదులుగా బాలీవుడ్ నటుడి బొమ్మ ఉంది. అవును బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫోటో ఉంది. అలాగే ఈ నోట్లపై ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించారు.
ఈ నోట్లను ఉపయోగించి బంగారం కొనడానికి ప్రయత్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఒక కోటి 60 లక్షల విలువైన ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 5 వందల రూపాయల నోటుపై అనుపమ్ ఖేర్ ఫోటో ఉండడంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం అనుపమ్ ఖేర్ దగ్గరికి కూడా వెళ్లగా.. అతడు స్పందిస్తూ.. 5 వందల నోట్లపై గాంధీజీ ఫోటోకు బదులుగా నా ఫోటోనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ కాలంలో ఏదైనా జరగవచ్చు అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

