Harsha Sai: వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.

Harsha Sai: వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.

Anil kumar poka

| Edited By: TV9 Telugu

Updated on: Sep 30, 2024 | 3:58 PM

క్రేజీ వీడియోలతో పాటు హర్షసాయిపై ఆరోపణలకు కొదవలేదు. ఇక రీసెంట్‌గా నార్సింగ్‌ పీఎస్‌లో అతనిపై లైంగిక దాడి కేసు ఫైలయింది. స్టోరీ డిస్కషన్‌ పేరిట ఇంటికి పిలిచి..మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ ఇచ్చి..అత్యాచారం చేశాడని.. వీడియో రికార్డ్‌ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తీశారు. మూవీ కాపీ రైట్స్‌ కోసం పక్కా ప్లాన్‌తో ఇవన్నీ చేశాడని.. వీడియోలను అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారామె.

క్రేజీ వీడియోలతో పాటు హర్షసాయిపై ఆరోపణలకు కొదవలేదు. ఇక రీసెంట్‌గా నార్సింగ్‌ పీఎస్‌లో అతనిపై లైంగిక దాడి కేసు ఫైలయింది. స్టోరీ డిస్కషన్‌ పేరిట ఇంటికి పిలిచి..మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ ఇచ్చి..అత్యాచారం చేశాడని.. వీడియో రికార్డ్‌ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తీశారు. మూవీ కాపీ రైట్స్‌ కోసం పక్కా ప్లాన్‌తో ఇవన్నీ చేశాడని.. వీడియోలను అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారామె. ఐతే అవన్నీ నిరాధార ఆరోపణలని, కేవలం డబ్బు కోసమే చేస్తున్నారని సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. మరి అతను చెప్పిందే నిజమైతే దాగుడుమూతలెందుకు? అనే చర్చ జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే హర్షసాయి సోషల్‌ మీడియాలో.. మరో ఆడియో రిలీజ్‌ చేశాడు. ఇప్పుడు ఆ ఆడియోతో మనోడు మామూలోడు కాదు అనే కామెంట్ నెటిజన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు.

ఫిబ్రవరిలో తమ మధ్య జరిగిన సంభాషణను లీక్ చేశాడు హర్ష. ఆ ఆడియోలో.. ఆమె పొగుడుతుంటే మురిసిపోతూ విన్నాడు. రొమాంటిగ్గా సాగిన ఆ ఆడియో టేప్లో.. తన కోసం ఆరాటపడుతున్న అమ్మాయి మాటలను వింటూ ఎంజాయ్‌ చేస్తున్నట్టుగా ఉంది. కళ్లు కృష్ణుడిలా ఉన్నాయన్న ఆమె కితాబుకు కితకితలు పడుతూ ఆ ఆడియోను హర్ష భద్రంగా సేవ్‌ చేసుకున్నాడు. నేటి పొగడ్తే రేపటి తెగడ్త అవుతుందని అనుకున్నాడో ఏమో కానీ.. ఆ ఆడియో ఫైల్స్‌ను భద్రంగా దాచుకుని ఇప్పుడు రిలీజ్ చేశాడు. ఆ ఆడియో టేప్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 29, 2024 02:02 PM