Harsha Sai Case: ఐదు రోజులుగా పరారీలోనే.. యూట్యూబర్‌ హర్షసాయి ఎక్కడ..? వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

తనపై రేప్‌ కేసు ఫైలయినప్పటి నుంచి హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. కానీ పోస్టులు, ఆడియో లీకులతో సోషల్‌ మీడియాలో తన ఉనికి చాటుకుంటున్నాడు.

Harsha Sai Case: ఐదు రోజులుగా పరారీలోనే.. యూట్యూబర్‌ హర్షసాయి ఎక్కడ..? వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
Harsha Sai
Follow us
Shaik Madar Saheb

| Edited By: TV9 Telugu

Updated on: Sep 30, 2024 | 3:58 PM

యూట్యూబర్‌ హర్షసాయి ఎక్కడ..? పోలీసుల కళ్లుగప్పి ఎక్కడికి వెళ్లాడు.. కేసు ఎందుకు డిలే అవుతోంది..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పటికే హర్షసాయిపై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటినుంచి.. అంటే ఐదురోజులుగా యూట్యూబర్‌ హర్షసాయి పరారీలోనే ఉన్నాడు.. హర్షసాయి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.. అయితే.. తనపై రేప్‌ కేసు ఫైలయినప్పటి నుంచి హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. కానీ పోస్టులు, ఆడియో లీకులతో సోషల్‌ మీడియాలో తన ఉనికి చాటుకుంటున్నాడు. అయితే ఈ మధ్య ఆడియో క్లిప్స్‌ కూడా విడుదల చేస్తున్నాడు హర్షసాయి. స్టోరీ డిస్కషన్‌ కోసమని ఇంటికి పిలిచి.. మత్తు మందు కలిపిన డ్రింక్‌ ఇచ్చి..అఘాయిత్యం చేశాడని..వీడియో రికార్డ్‌ చేసి బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్నాడనేది బాధితురాలి కంప్లేంట్‌. కానీ నిరాధర ఆరోపణలని.. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ట్వీట్‌తో ఆరోపించి .. అడ్వోకేట్‌ను రంగంలోకి దింపాడు హర్షసాయి.

మరోవైపు హర్షసాయి ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌కు సంబంధించిన ఆడియోను రిలీజ్‌ చేశారు. బ్యాన్‌ చేసిన బెట్టింగ్‌ యాప్‌ను ఎలా ప్రమోట్‌ చేస్తావంటే.. అంతా నా ఇష్టం.. పది కోట్లు వస్తాయి.. అది నా వాల్యూ అంటూ తన మార్కెట్‌ మంత్రను బయటపెట్టాడు హర్షసాయి.

ఇక గతంలో అతనిపై వున్న బెట్టింగ్‌ యాప్‌ వివాదాల డొంక మళ్లీ కదిలింది. ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. గేమ్‌ యాక్టింగ్‌ను ఉల్లంఘించారని హర్షసాయిపై తెలంగాణ డీజీపికి కంప్లేంట్‌ చేశారు.

మరోవైపు తనను బెట్టింగ్‌ గేమ్స్‌ను బానిసను చేశారని హర్షసాయిపై ఏపీలో బాధితులు తెరపైకి వస్తున్నారు. ఇలా బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కోసం హర్షసాయి పైకం వివరాలు బయటపడుతున్నాయి.

విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు..

హర్షసాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ సైబారాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతికి ఫిర్యాదు చేశారు బాధితురాలు. సోషల్‌ మీడియాలో తనను ట్రోల్‌ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారామె. ఎక్కడికి పోతావురా చిన్నవాడా అన్నట్టు హర్షసాయి జాడ కోసం గాలింపును ముమ్మరం చేశారు నార్సింగిపోలీసులు. స్పెషల్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు. ఐనా లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను ఇట్టే అరెస్ట్‌ చేశారు నార్సింగి పోలీసులు. మరీ హర్షసాయి విషయంలో ఇంత డిలే ఎందుకనే చర్చ జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..