Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్‌న్యూస్.. KBR పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి గ్రీన్‌ సిగ్నల్‌!

హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్‌ సర్కార్. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో 826 కోట్ల రూపాయలతో 6 జంక్షన్ల అభివృద్ధికి ప్లాన్‌ సిద్ధం చేసింది.

Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్‌న్యూస్.. KBR పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి గ్రీన్‌ సిగ్నల్‌!
Kbr Park Juction
Follow us

|

Updated on: Sep 29, 2024 | 10:42 AM

హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్‌ సర్కార్. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో 826 కోట్ల రూపాయలతో 6 జంక్షన్ల అభివృద్ధికి ప్లాన్‌ సిద్ధం చేసింది.

హైదరాబాద్ నడిబొడ్డులోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ఉన్న కేబీఆర్‌ పార్క్‌ చూట్టూ నిత్యం రద్దీ ఉంటుంది. ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్న మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. దీంతో ట్రాఫిక్‌ ఓరేంజ్‌లో ఉంటుంది. ఇక ఆ ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ఆరు జంక్షన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టుంది రేవంత్‌ ప్రభుత్వం.

ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని కేబీఆర్ పార్క్‌ చుట్టూ.. ఆరు జంక్షన్ల అభివృద్ధికి 826 కోట్ల రూపాయలతో ప్లాన్‌ సిద్ధం చేసింది ప్రభుత్వం. ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా.. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌కు ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో పనులు పూర్తయ్యేలా కార్యచరణ సిద్ధం చేస్తోంది. అంతేకాదు ఆధునాతన టెక్నాలజీతో ఆరు జంక్షన్ల నిర్మాణానికి పూనుకుంది. రోడ్‌ నంబర్‌ 45 నుంచి కేబీఆర్‌ పార్క్‌, యూసఫ్‌గూడ వైపు Y ఆకారంలో అండర్‌పాస్‌ నిర్మించనున్నారు. అలాగే కేబీఆర్‌ పార్క్‌ ఎంట్రన్స్‌ జంక్షన్‌ నుంచి రోడ్‌ నంబర్‌ 36 వైపు నాలుగు లేన్ల ఫ్లైవోవర్‌ రానుంది.

ఇటు యూసఫ్‌గూడ నుంచి రోడ్‌ నంబర్‌ 45 వైపు రెండు లేన్ల ఫ్లైవోవర్‌ ఏర్పాటుకానుంది. అలాగే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి క్యాన్సర్‌ హాస్పిటల్‌ వైపు మరో రెండు లేన్ల అండర్‌పాస్‌ నిర్మించనున్నారు. ఇటు కేబీఆర్ ఎంట్రన్స్‌ జంక్షన్‌ నుంచి పంజాగుట్ట దిశగా మూడు లేన్ల అండర్‌పాస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అటు ఫిల్మ్‌నగర్‌ జంక్షన్‌ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు దిశగా రెండు లేన్ల అండర్‌పాస్‌ రానుంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి రోడ్‌ నంబర్‌ 45 దిశగా రెండు లేన్ల ఫ్లైవోవర్‌ ఏర్పాటు కానుంది. జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలకు ఓకే చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిధులు విడుదల చేయనుంది. ఆ వెంటనే పనులు ప్రారంభంకానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.