వరంగల్ జిల్లా నర్సంపేటలోని నెహ్రూ నగర్ కాలనీలో ఆరడుగుల భారీ నాగుపాము ప్రత్యక్షమై తీవ్ర భయాందోళన సృష్టించింది. గంటకు పైగా ప్రజలను కలవరపెట్టిన ఈ విషసర్పం, స్నేక్ క్యాచర్ సురక్షితంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.