AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: వామ్మో.. థియేటర్లలో వణుకుపుట్టించింది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

సాధారణంగా తమిళం, మలయాళం భాషలలో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులోనూ ఈ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇటీవల ఓటీటీలో భాషతో సంబంధం లేకుండా విడుదలవుతున్న సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో నేచురల్ థ్రిల్లర్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది.

Cinema OTT: వామ్మో.. థియేటర్లలో వణుకుపుట్టించింది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Fourth Floor
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2026 | 7:23 AM

Share

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూడడం మీకు ఇష్టమా.. ? అయితే ఖచ్చితంగా ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే. ఇన్నాళ్లు థియేటర్లలో ప్రేక్షకులకు వణుకుపుట్టించింది. ఒళ్లు గగుర్పొడిచే సీన్లు.. ఊహించని ట్విస్టులతో సాగే ఈ తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా.. ? హారర్, మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన ఈ మూవీ.. థియేటర్లలో థ్రిల్లింగ్ ఎక్స్‏పీరియన్స్ ఇచ్చేందుకు వచ్చేస్తుంది. థియేటర్లలో విడుదలైన 21 రోజులకే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేయడానికి వచ్చేసింది. మనం మాట్లాడుకుంటున్న హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఫోర్త్ ఫ్లోర్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

ఇన్నాళ్లు థియేటర్లలో జనాలను వణికించిన ఈ సినిమా ఇప్పుడు మార్చి 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫోర్త్ ఫ్లోర్ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 27న విడుదలైంది. ఇప్పుడు కేవలం 21 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇందులో ఆరి అర్జునన్, దీప్శిక, పవిత్ర ప్రధాన పాత్రలు పోషించారు. డైరెక్టర్ ఎల్ఆర్ సుందరపాండి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఐఎండీబీలో 10కి గానూ 9.1 రేటింగ్ కలిగి ఉంది. మనో క్రియేషన్స్ బ్యానర్ పై ఎ.రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

కథ విషయానికి వస్తే.. ధీరన్ (ఆరి అర్జునన్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. గతంలో అను (పవిత్ర) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మనస్పర్థలతో ఇద్దరూ విడిపోతారు. ఒకరోజు చెన్నైకి రమ్మని ధీరన్ ను ఆహ్వనిస్తుంది అను. సిటీకి వచ్చి అతడు ఒంటరిగా ఓ అపార్ట్మెంట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటాడు. పక్క ప్లాట్ లోనే శ్వేత (దీప్శిక) షిప్ట్ అవుతుంది. అయితే చెన్నైకి వచ్చిన తర్వాత ధీరన్ కు అను గురించి ఏం తెలియదు. కానీ ఒక రోజు తాను ఉంటున్న ప్లా్ట్ లోనే అను చిన్నపాపతో ఉన్న ఫోటో దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఆద్యంతం ట్విస్టులు.. సస్పెన్స్ తో సాగుతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us