ఖమ్మం నగరంలో బంధువుల గృహప్రవేశ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఉత్సాహంగా హాజరైన బొమ్మ సుస్మిత అనే మహిళ వేడుక మధ్యలోనే తీవ్ర గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. సంతోషంగా మొదలైన శుభకార్యం, సుస్మిత మరణంతో కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.