AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manoj Nandam: 8 నెలలు వెయిట్ చేయించి వేరే స్టార్‏తో తీశారు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్.. యంగ్ హీరో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించాడు. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో మెప్పిస్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. మనోజ్ నందన్. నువ్వు లేక నేను లేను సినిమాతో బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. తర్వాత తెలుగులో హోలీ, అదృష్టం, ఓ చిన్నదాన, ఛత్రపతి, సంక్రాంతి, అతడు వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు.

Manoj Nandam: 8 నెలలు వెయిట్ చేయించి వేరే స్టార్‏తో తీశారు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్.. యంగ్ హీరో..
Manoj Nandam
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2026 | 8:56 AM

Share

నటుడు మనోజ్ నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో హిట్ చిత్రాల్లో కనిపించాడు. ప్రభాస్ నటించిన ఛత్రపతి చిత్రంలో టీనేజ్ ఛత్రపతిగా కనిపించారు. ఇప్పుడు ఈ కుర్రాడు హీరోగా మారాడు. ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని పెద్ద సినిమాల విషయంలో తనకు జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించారు. ఒక బ్లాక్‌బస్టర్ సినిమా కోసం తాను రెండు, మూడు రోజులు షూటింగ్ చేసినప్పటికీ, బడ్జెట్ సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయి, దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వేరే నటుడితో అదే సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్ అయిందని మనోజ్ నందం గుర్తు చేసుకున్నారు. మరో సందర్భంలో, ఒక పెద్ద డైరెక్టర్, పెద్ద సినిమా ప్రాజెక్ట్ కోసం ఆరు నెలలు వేచి చూసినా, “సారీ, ఫలానా పెద్ద హీరోతో లాంచింగ్‌కు ప్రాజెక్ట్ అడుగుతున్నారు” అని తనకు ఆ అవకాశం దక్కలేదని వివరించారు. అయితే, కనీసం తనకు విషయం తెలియజేసినందుకు ఆ ప్రాజెక్ట్ నిర్వాహకులను అభినందించారు. కొందరు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వేరే నటులతో సినిమాలు తీస్తారని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

సినిమా విజయంలో ప్రతిభ, పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) రెండింటి పాత్ర గురించి మాట్లాడుతూ, విజయం కోసం ప్రతిభే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పీఆర్ అనేది సినిమా విడుదల వరకు సహాయపడుతుందని, కానీ ప్రతిభ లేకపోతే విజయం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి సినిమా, మంచి ప్రతిభ, మంచి స్క్రిప్ట్ విజయాన్ని సాధిస్తాయని పేర్కొన్నారు. అయితే, సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండటం, తనను తాను ప్రమోట్ చేసుకోవడం ద్వారా నటులకు అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అంగీకరించారు. దర్శకులు, కాస్టింగ్ సిబ్బంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిని సులభంగా గుర్తుపడతారని, తద్వారా అవకాశాలు లభిస్తాయని మనోజ్ నందం అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుదల సినీ పరిశ్రమపై చూపుతున్న ప్రభావం గురించి మనోజ్ నందం చర్చించారు. ఒకప్పుడు 100 రోజులు, 100 సెంటర్లలో సినిమాలు ఆడేవని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని తెలిపారు. రీల్ కెమెరాల నుండి డిజిటల్ కెమెరాలకు మారడం, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఆదరణ పెరగడం వంటి మార్పులను ఆయన ప్రస్తావించారు. 2012లో తన “రొమాంటిక్ క్రైమ్ కథ” సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేసినప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు లేవని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం, సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే ఫోన్‌లలో, ఓటీటీలలో అందుబాటులోకి వస్తున్నాయని, ఇది వీక్షణ అనుభవాన్ని మార్చిందని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

Follow Us