మే 30 రాశిఫలాలు: గ్రహాల అనుగ్రహంతో.. ఈ రాశుల వారికి అదృష్ట యోగం!
Horoscope Today: మే 30, 2026 శనివారంనాటి రాశిఫలాల్లో మేష రాశి వారికి ఆదాయ వృద్ధి, వృషభ రాశి వారికి ఉద్యోగ బాధ్యతల పెరుగుదల, మిథున రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కనిపిస్తున్నాయి. మీ రాశికి ఈ రోజు గ్రహాల అనుకూలత ఎలా ఉంది? వృత్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం పరంగా 12 రాశుల పూర్తి ఫలితాలను తెలుసుకోండి.

దిన ఫలాలు (మే 30, 2026): మేష రాశి వారికి ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. తలపెట్టిన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారు. వ్యాపారాల్లో ఇతరులపై ఆధారపడకపోవడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు బాగా రాణిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశముంది. ఉద్యోగ జీవితంలో అధికారులు మీ సలహాలు, సూచనలతో లబ్ధి పొందుతారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు బాగా పురోగతి సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. పని భారంతో అవస్థలు పడతారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ప్రేమికులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో కొత్త బాధ్యతలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురో గమిస్తాయి. తలపెట్టిన పనులన్నిటినీ వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటులేదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబసమేతంగా ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు మిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్ని నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా సాగుతాయి. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. సర్వత్రా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. ఆర్థిక సహాయం విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రుల వల్ల నష్టాలకు గురవుతారు. కుటుంబపరంగా కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్త వుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్య మైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పదోన్నతికి, జీతాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి బాగా లబ్ధి పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత పనులు మీద శ్రద్ద అవసరం. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.