AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీట్ రచ్చ క్లోజ్.. కొత్త డౌట్లు రైజ్.. ఓవర్ టు ఢిల్లీ.. ఏం చెబుతుంది మళ్లీ?

ఢిల్లీ చల్లబడింది.. జంతర్‌మంతర్‌ జగడం ముగిసింది. పదిరోజుల హైడ్రామాకైతే శుభం కార్డు పడింది.. కానీ, ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అని కాదు, ఎవరు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు అనేదే డిబేటబుల్ పాయింట్‌గా మారింది. రచ్చ ఏ పరిస్థితుల్లో మొదలైంది.. ఎన్ని మలుపులు తిరిగింది.. ఎంత సున్నితంగా మారింది.. చివరికి ఎంత స్మార్ట్‌గా ముగిసింది.. ఎవరెవరికి ఏమేం గుణపాఠాలు నేర్పింది? విద్యార్థులు వర్సెస్ ప్రభుత్వం.. ఈ వార్‌జోన్ ఇండియన్ పొలిటికల్ ఫ్యూచర్‌ని ఎలా డిసైడ్ చెయ్యబోతోంది? ఇవి కదా రావల్సిన క్లారిటీలు?

నీట్ రచ్చ క్లోజ్.. కొత్త డౌట్లు రైజ్.. ఓవర్ టు ఢిల్లీ.. ఏం చెబుతుంది మళ్లీ?
Neet Paper Leak Episode Ends
Krishna S
|

Updated on: Jul 25, 2026 | 9:55 PM

Share

10 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో చాలా హర్ట్ అయ్యా.. వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే యువత ఆకాంక్షలనే గౌరవిస్తున్నా, విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నా.. అని నీట్ పేపర్‌ లీకేజ్‌కి బాధ్యత తీసుకుని రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్‌. విద్యార్థులు ఇప్పటికైనా తమ భవిష్యత్తుపై దృష్టిపెట్టాలి, ఎవరి చేతుల్లోనూ టూల్‌కిట్స్ కావొద్దు అని ఒక మెసేజ్‌ కూడా ఇచ్చేశారు ధర్మేంద్ర. అటు, యుద్ధం ఆగింది, డెమొక్రసీ గెలిచింది, ఉద్యమం ఇక ముగిసినట్టే అని ప్రకటించేసింది కాక్రోచ్ పార్టీ. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితి మళ్లీ కూల్‌ కూల్. సంబరాలు ముగిసిపోగానే జంతర్‌మంతర్‌ను ఖాళీ చేసి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. స్థంభించిన ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటోంది. ప్రజారవాణా రీస్టార్ట్ ఐంది. మూతబడ్డ మెట్రో స్టేషన్లు తెరుచుకున్నాయి. విద్యార్థులు వెనక్కి వెళ్లేందుకు రైళ్లు, బస్సులు అందుబాటులోకొచ్చాయి. అన్ని కార్నర్స్‌ నుంచీ కాక్రోచ్ పార్టీకి అభినందన సందేశాలొస్తున్నాయ్. సాధించారు బ్రో అని రాహుల్‌గాంధీ కూడా కంగ్రాట్ చేశారు. జూన్ 28న ఢిల్లీ జంతర్ మంతర్‌లో సోనమ్‌ వాంగ్‌చుక్ నిరాహారదీక్షతో మొదలైంది రగడ. నీట్ పేపర్ లీకేజ్‌కి బాధ్యతగా మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది వాంగ్‌చుక్ డిమాండ్. జూలై 18.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసి, ఆసుపత్రికి తరలించారు పోలీసులు. జూలై 20 సీజేపీ ఛలోపార్లమెంట్ రక్తసిక్తం. జన్‌పథ్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వైపు దారితీసే రోడ్లపై రణరంగం సీన్లు. జూలై 21 ఎటాక్ పీఎం...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి