AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉసేన్‌ బోల్ట్‌ రికార్డు బ్రేక్​ అయిందని తెలుసా? ఎవరు చేశారో తెలిస్తే నిజంగానే మతిపోద్ది

Usain Bolt Speed Record.. టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త సంచలనం నమోదైంది. అత్యంత ఫాస్టెస్ట్ మ్యాన్‌గా పేరుగాంచిన జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన చారిత్రాత్మక రికార్డును ఓ రోబోట్ బద్దలు కొట్టింది. చైనాకు చెందిన ఒక ప్రముఖ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన హ్యూమనోయిడ్ రోబోట్ పరుగులో సంచలనం సృష్టిస్తోంది. ఈ అద్భుతమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఉసేన్‌ బోల్ట్‌ రికార్డు బ్రేక్​ అయిందని తెలుసా? ఎవరు చేశారో తెలిస్తే నిజంగానే మతిపోద్ది
Unitree Humanoid Robot
Nikhil
|

Updated on: Aug 23, 2026 | 7:40 AM

Share

చైనాకు చెందిన రోబోటిక్ కంపెనీ యూనిట్రీ రూపొందించిన సూపర్ హ్యూమన్ రోబోట్ తన అసాధారణ వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రాక్‌పై మెరుపు వేగంతో దూసుకెళ్లిన ఈ రోబోట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మానవులకు సాధ్యంకాని వేగంతో పరిగెడుతున్న ఈ టెక్నికల్ వండర్ విశేషాలను ఈ తెలుసుకుందాం.

సూపర్ హ్యూమన్ రోబోట్ వేగం

టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త సంచలనం నమోదైంది. అత్యంత ఫాస్టెస్ట్ మ్యాన్ గా పేరుగాంచిన జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన చారిత్రాత్మక రికార్డును ఓ రోబోట్ బద్దలు కొట్టింది. చైనాకు చెందిన ఒక ప్రముఖ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన హ్యూమనోయిడ్ రోబోట్.. పరుగులో బోల్ట్ రికార్డును చేరిపేసిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చైనాకు చెందిన రోబోటిక్ కంపెనీ యూనిట్రీ ‘సూపర్ హ్యూమన్’ పేరుతో సరికొత్త హ్యూమనాయిడ్ రోబోట్ ను ఆవిష్కరించింది. ఇది సెకనుకు 12.66 మీటర్ల గరిష్ట వేగంతో పరిగెత్తగలదని కంపెనీ తెలియజేసింది. ఈ రోబోట్ ను కేవలం 3 నెలల్లోనే అభివృద్ధి చేసినట్లు తెలిపింది.

అంతేకాకుండా ట్రాక్ పై ఇది అత్యంత వేగంగా పరిగెడుతున్న దృశ్యాలను సైతం సదరు రోబోటిక్ కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. 2009 బెర్లిన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల రేసును కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అప్పుడు బోల్ట్ సెకనకు 12.42 మీటర్ల వేగంతో పరిగెత్తడం గమనార్హం. ఇప్పుడు చైనా రోబోట్ ట్రాక్‌పై సెకనుకు 12.66 మీటర్ల వేగం (గంటకు 45.6 కి.మీ స్పీడ్)తో దూసుకెళ్లింది.

ఈ లెక్కన చూస్తే ఇదే వేగంతో 100 మీ. బోల్ట్ రికార్డును ఇది ఈజీగానే బద్దలు గొడుతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సూపర్ హ్యూమన్ రోబోట్ ఒకేచోట నిలబడి ఏకంగా 2 మీటర్ల ఎత్తువరకూ జంప్ చేసి ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టి మానవులకు సాధ్యంకానీ పనులను చేసే దిశగా రోబోటిక్స్ టెక్నాలజీ ఎదుగుతుందోని అర్థం చేసుకోవచ్చు.

నెటిజన్ల రియాక్షన్

రోబోట్ పరుగు వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ లేదా అథ్లెటిక్స్ విభాగంలో రోబోట్లకు ప్రత్యేక పోటీలు పెట్టాలేమో అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్ల అభివృద్ధి చూస్తుంటే భయం వేస్తోందని మరికొందరు అభిప్రాయపడ్డారు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే సీన్స్.. ఇప్పుడు కళ్లముందు నిజమవుతున్నాయని ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు.

మొత్తం మీద ఈ సూపర్ హ్యూమన్ రోబోట్ తన వేగంతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు. మానవ మేధస్సుకు సాంకేతికత తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈ ఘటన మరోసారి నిరూపించింది. భవిష్యత్తులో మరిన్ని విప్లవాత్మక మార్పులకు ఈ రకమైన రోబోటిక్స్ ఆవిష్కరణలు పునాది వేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

Follow Us