AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలనం సృష్టిస్తున్న బజాజ్​ చేతక్ ఎలక్ట్రిక్.. అమ్మకాల్లో భారీ వృద్ధి.. ఎంతో తెలిస్తే షాకే

Bajaj Chetak Electric.. ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో బజాజ్ చేతక్ దూసుకెళ్తోంది. కంపెనీకి జూలై నెలలో చేతక్ అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో చేతక్ విక్రయాలు ఊహించని విధంగా దూసుకుపోయాయి. ఈ అద్భుతమైన వృద్ధికి సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకుందాం.

సంచలనం సృష్టిస్తున్న బజాజ్​ చేతక్ ఎలక్ట్రిక్.. అమ్మకాల్లో భారీ వృద్ధి.. ఎంతో తెలిస్తే షాకే
Bajaj Chetak Electric Scooter
Nikhil
|

Updated on: Aug 23, 2026 | 7:10 AM

Share

ఒకప్పుడు భారతీయుల అభిమాన స్కూటర్‌గా నిలిచిన బజాజ్ చేతక్, ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. తక్కువ నిర్వహణ ఖర్చు, మెరుగైన రేంజ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ స్కూటర్ విక్రయాల గణాంకాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

విక్రయాల వివరాలు

ఎలక్ట్రిక్ స్కూటర్‌ మార్కెట్‌లో బజాజ్ చేతక్‌ దూసుకెళ్తోంది. కంపెనీకి జూలై నెలలో చేతక్‌ అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో చేతక్‌ విక్రయాలు ఏకంగా 307 శాతం పెరిగాయి. జూన్‌తో పోల్చినా జూలైలో అమ్మకాలు 17 శాతం వృద్ధి సాధించడం విశేషం. జూలైలో బజాజ్‌ మొత్తం 47,184 చేతక్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 11,584 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

జూన్‌లో 40,376 చేతక్‌ స్కూటర్లు విక్రయించగా, జూలైలో ఆ సంఖ్య 47,184కు చేరింది. ఒకప్పుడు భారతీయుల అభిమాన స్కూటర్‌గా నిలిచిన బజాజ్ చేతక్‌.. ఆటోమేటిక్ స్కూటర్ల రాకతో మార్కెట్‌లో తన ప్రాభవాన్ని కోల్పోయింది. అయితే 2019లో బజాజ్‌ సంస్థ చేతక్‌ను మళ్లీ భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈసారి పెట్రోల్‌ ఇంజిన్‌కు బదులుగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా పరిచయం చేసింది. ప్రస్తుతం చేతక్‌ ఎలక్ట్రిక్‌ విభాగంలో బజాజ్‌కు కీలకమైన ఉత్పత్తిగా మారుతోంది. చేతక్‌ ప్రస్తుతం పలు బ్యాటరీ, రేంజ్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

వేరియంట్లు, రేంజ్

చేతక్ C2501 బేస్‌ మోడల్‌ 2.5kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 113 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.91,504 నుంచి ప్రారంభమవుతుంది. ఇక చేతక్ C3001 3.0kWh బ్యాటరీతో 131 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.1,14,270గా ఉంది. మరోవైపు చేతక్ 35 సిరీస్ 3.5kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 153 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ.1,24,157 ఎక్స్‌-షోరూమ్‌గా ఉంది.

చేతక్ 35 సిరీస్‌ నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. 3.5kWh బ్యాటరీని ఇంట్లో పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి సుమారు రూ.35 ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన సుమారు రూ.35 విద్యుత్‌ ఖర్చుతో 153 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. బజాజ్ చేతక్‌ అమ్మకాల్లో నమోదవుతున్న ఈ భారీ వృద్ధి.. భారతదేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణను కూడా సూచిస్తోంది. రేంజ్‌, తక్కువ నిర్వహణ వ్యయం, పాత చేతక్‌ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం వంటి అంశాలు ఈ స్కూటర్‌కు డిమాండ్‌ పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.

Follow Us
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో బజాజ్ చేతక్ సంచలనం.. మరీ దారుణం
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో బజాజ్ చేతక్ సంచలనం.. మరీ దారుణం
కొలంబో వేదికగా జడేజా చారిత్రాత్మక రికార్డు
కొలంబో వేదికగా జడేజా చారిత్రాత్మక రికార్డు
పోలీసుల నిర్లక్ష్యం..ఉరివేసుకున్న మహిళ చనిపోయిందంటూ గదికి తాళం..
పోలీసుల నిర్లక్ష్యం..ఉరివేసుకున్న మహిళ చనిపోయిందంటూ గదికి తాళం..
వేడి నీళ్లు vs చల్లని నీళ్లు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వేడి నీళ్లు vs చల్లని నీళ్లు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో సీఎంఎఫ్‌ బడ్స్‌ నియో
బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో సీఎంఎఫ్‌ బడ్స్‌ నియో
భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి తొలిసారి సీఎం చంద్రబాబు ప్రయాణం
భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి తొలిసారి సీఎం చంద్రబాబు ప్రయాణం
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి నాలుగు ఆకులు నమిలి చూడండి.. ప్రయోజనాలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి నాలుగు ఆకులు నమిలి చూడండి.. ప్రయోజనాలు
జియోలో తక్కువ ధరల్లో 98 రోజుల ప్లాన్‌ గురించి మీకు తెలుసా..?
జియోలో తక్కువ ధరల్లో 98 రోజుల ప్లాన్‌ గురించి మీకు తెలుసా..?
మీ హెల్మెట్‌కు కూడా గడువు తేదీ ఉంటుందని మీకు తెలుసా?
మీ హెల్మెట్‌కు కూడా గడువు తేదీ ఉంటుందని మీకు తెలుసా?
కొండచిలువకు మనుషుల చికిత్సతో ప్రాణభిక్ష!
కొండచిలువకు మనుషుల చికిత్సతో ప్రాణభిక్ష!