AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవాలయ సమీపంలో బిత్తర చూపులు చూస్తున్న వ్యక్తి.. అనుమానంతో ఆరా తీయగా..

బిహార్ నుంచి తక్కువ ధరకు నాటు తుపాకులను తెచ్చి హైదరాబాద్ నగరంలో అధిక ధరకు విక్రయించేందుకు ప్లాన్‌ చేసిన ఒక పాత నేరస్థుడిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు పక్కా సమాచారం పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి భారీగా అక్రమ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి సీపీ సుమతి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

దేవాలయ సమీపంలో బిత్తర చూపులు చూస్తున్న వ్యక్తి.. అనుమానంతో ఆరా తీయగా..
Illegal Gun Smuggling
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2026 | 7:45 AM

Share

బిహార్ నుంచి తక్కువ ధరకు అక్రమ తుపాకులను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించడానికి యత్నించిన అంతర్‌రాష్ట్ర నేరస్థుడిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజిపుర్ జిల్లాకు చెందిన పర్బన్ కుమార్ ఉపాధి నిమిత్తం 2021లో హైదరాబాద్‌కు వచ్చి చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నివాసముంటూ పనులు చేసుకునేవాడు. అయితే, ఈజీ మనీకి అలవాటు పడిన పర్బన్ కుమార్ గంజాయి విక్రయాలు ప్రారంభించాడు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా 2024లో చర్లపల్లి పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలయ్యాక తన నివాసాన్ని పటాన్‌చెరులోని బిహార్ బస్తీకి మార్చాడు.

త్వరగా ఎక్కువ మొత్తం సంపాదించాలనే ఆలోచనతో బిహార్‌లో తక్కువ ధరకు లభించే దేశవాళీ తుపాకులను హైదరాబాద్ తెచ్చి విక్రయించాలని ప్లాన్ చేశాడు. పాత పరిచయస్తుల సమాచారంతో ఈ నెల 10న బిహార్ వెళ్లిన పర్బన్, అక్కడ సోనూ అనే డీలర్ నుండి ఒక్కో తుపాకీకి రూ.30,000 చొప్పున చెల్లించి రెండు దేశవాళీ తుపాకులు, ఒక తపంచా, 19 సజీవ తూటాలను కొనుగోలు చేశాడు.

బొల్లారంలో పోలీసులకు చిక్కిన నిందితుడు:

కొనుగోలు చేసిన ఆయుధాలతో ఈ నెల 22న హైదరాబాద్ చేరుకున్న నిందితుడు, బొల్లారంలోని సాధనా మందిర్ సమీపంలో కొనుగోలుదారుల కోసం వేచి చూస్తుండగా మల్కాజిగిరి ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ జానయ్య బృందం పక్కా సమాచారంతో దాడి చేసింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న పర్బన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా ఆయుధాలు లభ్యమయ్యాయి. నిందితుడిపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి బొల్లారం పోలీసులకు అప్పగించి శనివారం రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us