AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gunasekhar: జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ ఆగిపోవడానికి కారణం అదే.. ఓపెన్‌గా చెప్పేసిన దర్శకుడు

దర్శకుడు గుణశేఖర్ సైనికుడు సినిమా విశేషాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మహేష్ బాబు అద్భుత నటన, డేరింగ్ క్యాస్టింగ్ నిర్ణయం, క్లైమాక్స్ డైలాగ్ డెలివరీ గురించి ఆయన వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి.

Gunasekhar: జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ ఆగిపోవడానికి కారణం అదే.. ఓపెన్‌గా చెప్పేసిన దర్శకుడు
Guna Sekhar
Ravi Kiran
|

Updated on: Mar 18, 2026 | 9:42 AM

Share

దర్శకుడు గుణశేఖర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని కీలక ఘట్టాలు, ముఖ్యంగా మహేష్ బాబు నటించిన సైనికుడు చిత్రం, ఇతర ప్రాజెక్టుల గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సైనికుడు సినిమాలో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్‌గా త్రిషాని కాకుండా విలన్‌గా ఇర్ఫాన్ ఖాన్‌కు హీరోయిన్‌గా త్రిషాని తీసుకోవడం అప్పట్లో ఒక డేరింగ్ నిర్ణయమని గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు. హీరోయిన్ కోణంలో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా, మహేష్ బాబు విలన్‌గా కనిపించడం ఒక కొత్తదనాన్ని ఇచ్చిందని, మహేష్ బాబు ఈ ఐడియాను ఎంతో ఉత్సాహంగా ఓకే చెప్పారని తెలిపారు.

ఈ సినిమా క్లైమాక్స్‌లో మహేష్ బాబు గురుజాల నంద పాత్రలో చెప్పే నాలుగు పేజీల డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ డైలాగులను పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు రచించారు. ఈ డైలాగులు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయని, షూటింగ్‌కు ముందురోజు రాత్రి మహేష్ బాబుకు ఫోన్ చేసి పంపించగా, ఆయన ఉత్సాహంగా సవాల్‌ను స్వీకరించారని గుణశేఖర్ వివరించారు. మహేష్ బాబు ఆ నాలుగు పేజీల డైలాగులను సింగిల్ టేక్‌లో, ఎక్కడా తడబడకుండా అద్భుతంగా చెప్పారని, ఆ రోజు సెట్‌లో ఉన్న అందరికీ గూస్ బంప్స్ వచ్చాయని పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చర్చల గురించి మాట్లాడుతూ.. జై భేరి కిషోర్ నిర్మాణంలో ఒక ప్రాజెక్ట్ దాదాపు ఆరు నెలలు చర్చల్లో ఉన్నా, కథ ఇద్దరికీ సంతృప్తినివ్వకపోవడంతో అది వర్కౌట్ అవ్వలేదని గుణశేఖర్ స్పష్టం చేశారు. కథ ముందుగా పుట్టి, ఆ కథకు తగిన నటులు లభిస్తేనే సినిమా సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక్కడు సినిమా తర్వాత రుద్రమదేవి చేయాలని బలంగా నిర్ణయించుకున్నట్లు గుణశేఖర్ తెలిపారు. టీమ్‌తో సహా వరంగల్ వెళ్లి రీసెర్చ్ చేసినప్పటికీ, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో నిర్మాతలు నిధులు కేటాయించడానికి వెనుకాడారని వివరించారు. తన విజన్‌ను తాను నమ్మడం ఒక ఎత్తైతే, అనుష్క శెట్టి తనను నమ్మి ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని గుణశేఖర్ అనుష్క అంకితభావాన్ని కొనియాడారు.

Follow Us