Tollywood: బిగ్ బాస్‌తో స్టార్ డమ్.. స్టార్ హీరో స్టేటస్.. ఇప్పుడేమో రోడ్డుపై బిచ్చగాడిలా.. షాక్ లో ఫ్యాన్స్

పై ఫొటోలో ఉన్నది దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో. బిగ్ బాస్ రియాల్టీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు అనూహ్యంగా బిచ్చగాడిలా మారిపోయి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు.

Tollywood: బిగ్ బాస్‌తో స్టార్ డమ్.. స్టార్ హీరో స్టేటస్.. ఇప్పుడేమో రోడ్డుపై బిచ్చగాడిలా.. షాక్ లో ఫ్యాన్స్
Actor As A Beggar
Follow us
Basha Shek

|

Updated on: Oct 19, 2024 | 6:53 PM

సినిమాల కోసం ప్రాణం పెట్టి నటించే యాక్టర్లు చాలా మందే ఉన్నారు మన ఇండస్ట్రీలో. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేందుకు వీరు ఎలాంటి సాహసాలకైనా సై అంటారు. పాత్రల్లో సహజత్వం కనిపించడానికి జట్టు, గడ్డం భారీగా పెంచడం, బరువు పెరగడం.. ఇలా ఎన్నో రకాల త్యాగాలు చేస్తుంటారు కొందరు హీరోలు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి డేరింగ్ పాత్రలు పోషించాలంటే విక్రమ్ తర్వాతనే ఎవరైనా. అయితే ఇప్పుడు ఒక యంగ్ హీరో సినిమా కోసం బిచ్చగాడిలా మారిపోయాడు. ఎంతలా అంటే ఆ హీరోను నిజమైన యాచకుడిగా భావించిన ఒక అమ్మాయి అతనికి రూ. 20 దానం చేసింది. పై ఫొటోలో ఉన్నది ఆ హీరోనే. ఇతను మన తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ తమిళ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. ఈ యంగ్ హీరో పేరు కెవిన్. గతంలో తమిళ బిగ్ బాస్ షోలోనూ పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ హ్యాండ్సమ్ కుర్రాడు. ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. నాట్పున ఎన్నను తెరియుమా, లిఫ్ట్‌, దాదా, స్టార్‌ సినిమాలతో ఆడియెన్స్ ను మెప్పించాడు. కెవిన్ నటించిన దాదా తో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అలాంటి హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు ఒక సినిమా కోసం యాచకుడిలా మారాల్సి వచ్చింది. శివబాలన్‌ దర్శకత్వంలో కెవిన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘బ్లడీ బెగ్గర్’. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. పేరుకు తగ్గట్టుగానే ఈ మూవీలో బిచ్చగాడిలా కనిపించాడు కెవిన్. కెవిన్ ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. బెగ్గర్ పాత్ర లో అతను ప్రాణం పెట్టి నటించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘వరుణ్ డాక్టర్’, ‘బీస్ట్’, ‘జైలర్’ సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న నెల్సన్ ఈ బ్లడీ బెగ్గర్ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్31న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంది. అయితే ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్ కూడా రిలీజయ్యే అవకాశముంది. ఈ సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన కెవిన్ ‘.. ‘ నేను భిక్షగాడి గెటప్‌ వేసుకుని రోడ్డుపైకి వెళ్లాను. నన్నెవరైనా గుర్తుపడతారా? లేదా బిచ్చగాడినే అని నమ్ముతారా? అని నన్ను నేను పరీక్షించుకుందామనుకున్నాను. కానీ ఒకమ్మాయి నాకు రూ.20 దానం చేసింది. అప్పుడు నా లుక్‌పై నమ్మకం పెరిగింది’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

బ్లడీ బెగ్లర్ సినిమాలో కెవిన్..

కెవిన్ రియల్ లుక్..

View this post on Instagram

A post shared by Kavin M (@kavin.0431)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే