- Telugu News Photo Gallery Cinema photos Jr.NTR's Devara Movie Actress Shruti Marathe Latest Stunning Photos Goes Viral
Devara Movie: కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తోన్న ‘దేవర’ బ్యూటీ.. నెట్టింట అందాల విధ్వంసం ఈ హీరోయిన్..
దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా అడియన్స్ ముందుకు వచ్చి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది శ్రుతి మరాఠీ.
Updated on: Oct 19, 2024 | 6:33 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా దేవర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. తండ్రికొడుకుల పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఇందులో తండ్రి క్యారెక్టర్ దేవరకు జోడిగా నటించింది శ్రుతి మరాఠీ. ఈ సినిమాతో చాలా ఫేమస్ అయ్యింది.

దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈబ్యూటీ చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఈ అమ్మడు గురించి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. గుజరాత్ కు చెందిన ఈ బ్యూటీ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది.

దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈబ్యూటీ చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఈ అమ్మడు గురించి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. గుజరాత్ కు చెందిన ఈ బ్యూటీ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది.

మరాఠీ నటుడు గౌరవ్ ఘటనేకర్ ను 2016లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి చిత్రం అయినప్పటికీ అందం, అభినయంతో కట్టిపడేసింది.





























