Bhanu Chander: సీనియర్ హీరో భాను చందర్ కుమారుడిని చూశారా? టాలీవుడ్‌లో క్రేజీ హీరో..

80-90వ దశకంలో యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భాను చందర్. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ క్యూ కట్టేవారు. మచిలీ పట్నం ప్రాంతానికి చెందిన భాను చందర్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జయంత్ ఇప్పటికే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Bhanu Chander: సీనియర్ హీరో భాను చందర్ కుమారుడిని చూశారా? టాలీవుడ్‌లో క్రేజీ హీరో..
Bhanu Chander
Follow us
Basha Shek

|

Updated on: Oct 18, 2024 | 8:26 PM

సీనియర్ హీరో భాను చందర్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 80-90వ దశకంలో స్టార్ హీరోగా వెలుగొందారాయన. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారీ ట్యాలెంటెడ్ యాక్టర్. 1978లో వచ్చిన మన ఊరి పాండవులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు భాను చందర్. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బెబ్బులి, ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం, వంశ గౌరవం, ఇద్దరు కిలాడీలు, మెరుపు దాడి, రేచుక్క, పున్నమి రాత్రి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయాడు. ముఖ్యంగా భాను చందర్ యాక్షన్ సినిమాలకు అప్పట్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఇక భాను చందర్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏదంటే 1986లో వచ్చిన నిరీక్షణ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా వచ్చాయి. దీని తర్వాత కూడా హీరోగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు భాను చందర్. అయితే కాలక్రమేణా హీరోగా వరుసగా ప్లాఫులు ఎదురుకావడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారీ సీనియర్ యాక్టర్. ముఖ్యంగా పోలీసాఫీసర్ పాత్రలు వేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్లో నటించారు భాను చందర్. రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్), మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించాడు.

ఇవి కూడా చదవండి

అన్నట్లు భాను చందర్‌ సినీ వారసత్వాన్ని నిలబట్టేందుకు ఆయన కొడుకు జయంత్ భాను చందర్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. నా కొడుకు బంగారం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జయంత్. 2013లో రిలీజైన సినిమా పెద్దగా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ సినిమాకు భాను చందరే దర్శకత్వం వహించారు. లుక్స్, యాక్టింగ్ పరంగా జయంత్ ఆకట్టుకున్నా సినిమా సక్సెస్ కాకపోవడంతో జయంత్ పేరు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆ తర్వాత కూడా జయంత్ పెద్దగా సినిమాలు చేయలేదు. దీంతో అతను ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వేరే వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడని తెలుస్తోంది.

Bhanu Chander Son

Bhanu Chander Son

ఇద్దరు కుమారులతో భాను చందర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.