Trisha Krishnan: ఏంటీ..! త్రిష ఫేవరెట్ హీరోయిన్స్ ఈ ముద్దుగుమ్మలేనట..!
1999లో మిస్ సేలం, మిస్ మద్రాస్ పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. మరియు 2001లో, మిస్ ఇండియా పోటీలో ఆమె బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును గెలుచుకుంది. అలాగే ప్రశాంత్, సిమ్రాన్ నటించిన జోడి చిత్రంలో సిమ్రాన్ స్నేహితురాలిగా కనిపించింది త్రిష.
అందాల ముద్దుగుమ్మ త్రిష స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చెన్నైకి చెందిన త్రిష 1983 మే 4న జన్మించింది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. 1999లో మిస్ సేలం, మిస్ మద్రాస్ పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. మరియు 2001లో, మిస్ ఇండియా పోటీలో ఆమె బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును గెలుచుకుంది. అలాగే ప్రశాంత్, సిమ్రాన్ నటించిన జోడి చిత్రంలో సిమ్రాన్ స్నేహితురాలిగా కనిపించింది త్రిష. ఆ తర్వాత అమీర్ దర్శకత్వంలో వచ్చిన మౌనం పసితే సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఇక తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు
అతడు, వర్షం, కృష్ణ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, బుజ్జిగాడు, స్టాలిన్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక సీనియర్ హీరోలు నాగార్జున సరసం కింగ్, బాలకృష్ణ కు జోడీగా లయన్, చిరంజీవితో స్టాలిన్, అలాగే వెంకటేష్ తో నమో వెంకటేశ, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలు చేసింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియేంటడ్ మూవీస్ కూడా చేసింది. ఇక ఇప్పుడు తమిళ్ లోనే ఎక్కువ దృష్టి పెట్టింది.
ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!
ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే త్రిష ఇండస్ట్రీలో తన అభిమాన హీరోయిన్స్ ఎవరు అనేది గతంలో చెప్పింది. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. 22 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష గతంలో తన అభిమాన హీరోయిన్స్ వీరే అంటూ కొంతమంది పేర్లు చెప్పింది. గతంలో త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అందులో తనకు అనుష్క, నిత్యా మీనన్, ఇవానా, తుషార విజయన్, సాయి పల్లవి, రష్మిక అంటే ఇష్టమని తెలిపింది. త్రిష చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.