AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఉగాది స్పెషల్.. ఓటీటీలోకి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది

ఈ వారం ఓటీటీలోకి మరో కొత్త సినిమా వచ్చేస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ఇది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కు రానుంది.

OTT Movie: ఉగాది స్పెషల్.. ఓటీటీలోకి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది
Seetha Payanam Movie
Basha Shek
|

Updated on: Mar 18, 2026 | 6:12 PM

Share

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడలో వందలాది సినిమాలు చేశాడీ సీనియర్ హీరో. డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. అయితే ప్రస్తుతం నటుడిగా సినిమాలు బాగా తగ్గించేశాడు అర్జున్. తన వారసురాలిగా కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఐశ్వర్యని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ సీతా పయనం అనే మూవీని తెరకెక్కించాడు. గత నెలలోనే ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతా పయనం ఓ మోస్తరుగా ఆడింది. కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్ ఈ చిత్రంలో హీరో గా నటించాడు. ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, కోవై సరళ, సిరి హనుమంత్, సరన్ శక్తి, మణి చందన తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే అర్జున్, అతని మేనల్లుడు కన్నడ ధ్రువ్ సర్జా క్యామియో పాత్రల్లో మెరిశారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

సీతా పయనం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. ఉగాది కానుకగా గురువారం (మార్చి 19) నుంచి సీతా పయనం సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు సన్ నెక్స్ట్ ప్రకటించింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే  ఈ కొత్త సినిమా ఓటీటీలోకి రానుందన్నమాట. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేసింది సన్ నెక్ట్స్.   తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సీతా పయనం మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అర్జున్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. అలాగే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరాలు అందించడం విశేషం. మరి ఈ సీతా పయనం సినిమాను థియేటర్లలో మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో సీతా పయనం మూవీ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
1.3 కిలోల పులసకు భారీ ధర
1.3 కిలోల పులసకు భారీ ధర
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా