Salman Khan: ‘నా కొడుకు బొద్దింకకు కూడా హాని తలపెట్టడు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’: సల్మాన్ తండ్రి

సల్మాన్ ఖాన్ అత్యంత సన్నిహితుడైన బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత మార్చడం ముంబైలో కలకలం రేపింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా అతనికి వైప్లస్ సెక్యూరిటీని కల్పిస్తోంది.

Salman Khan: 'నా కొడుకు బొద్దింకకు కూడా హాని తలపెట్టడు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు': సల్మాన్ తండ్రి
Salman Khan
Follow us
Basha Shek

|

Updated on: Oct 19, 2024 | 8:00 PM

సినిమాల పరంగా కాకుండా వేరే విషయాలతో ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో నిలుస్తున్నాడు సల్మాన్ ఖాన్. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ నుంచి తరచూ అతనికి బెదిరింపులు వస్తున్నాయి. కృష్ణ జింకలను వేటాడాడానే కోపంతో బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఈ విషయంలో బాలీవుడ్ నటుడు క్షమాపణ చెప్పాలని బిష్ణోయ్ గ్యాంగ్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బిష్ణోయ్ వర్గం కృష్ణ జింకలను దేవతలతో సమానంగా ఆరాధిస్తోంది. ఈనేపథ్యంలోనే సల్మాన్ కృష్ణ జింకలను వేటాడడంతో అతనిపై కోపంతో రగిలిపోతున్నాడు లారెన్స్ బిష్ణోయ్. జైల్లో నే ఉంటూ స్టార్ హీరోకు వరుసగా బెదిరింపు సందేశాలు పంపుతున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ని వచ్చి తన గుడికి క్షమాపణ చెప్పాలని లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్ ఇటీవల డిమాండ్ చేసింది. అయితే సల్మాన్ కృష్ణ జింకలను కాదు కదా బొద్దింకకు కూడా హాని చేయలేదంటున్నాడు సల్మాన్ తండ్రి సలీం ఖాన్.

‘సల్మాన్ ఖాన్ నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. జంతువులను వేటాడటం సల్మాన్‌కు ఇష్టం ఉండదు. అతనికి జంతువులంటే చాలా ఇష్టం. నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు’ అని సలీంఖాన్ చెప్పుకొచ్చారు. సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలని బిష్ణోయ్ గ్యాంగ్ అంటోంది. దీనిపై సలీం ఖాన్ మాట్లాడుతూ.. ‘క్షమాపణలు చెప్పడం అంటే మేం తప్పును అంగీకరించినట్లే. సల్మాన్ ఖాన్ ఏ జంతువును చంపలేదు. అతను కనీసం బొద్దింకకు కూడా హాని తలపెట్టలేదు. సల్మాన్ ఖాన్ ఎవరికి క్షమాపణలు చెప్పాలి? మీరు ఎంత మందికి క్షమాపణలు చెప్పారు? మీరు ఎన్ని జంతువుల ప్రాణాలను కాపాడారు? నా కొడుకు ఏం తప్పు చేసాడు? మీరు కేసు దర్యాప్తు చేశారా? నే’ అని సలీం ఖాన్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్..

కాగా సల్మాన్ అత్యంత సన్నిహితుడు బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. దీంతో ఈ నటుడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. అయినా బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల మధ్యే ‘సిఖందర్’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు సల్మాన్. అలాగే బిగ్ బాస్ షోనూ కంటిన్యూ చేస్తున్నాడు.

బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?