AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Remo Dsouza: బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాపై కేసు.. కారణం ఇదే..

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాలకు వర్క్ చేశారు. అలాగే బుల్లితెరపై అనేక డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జీగా ఉన్నారు. తాజాగా అతడిపై ఫోర్జరీ కేసు నమోదైంది.

Remo Dsouza: బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాపై కేసు.. కారణం ఇదే..
Remo Dsouza
Rajitha Chanti
|

Updated on: Oct 19, 2024 | 7:26 PM

Share

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాతోపాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముంబై పోలీసులు. రెమోతోపాటు అతడి భార్య లిజెల్లే, మరో ఐదుగురి వ్యక్తులు తనను మోసం చేసి అధిక మొత్తంలో డబ్బులు కాజేశారని పేర్కొంటూ ఓ యువ డ్యాన్సర్ థానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు రెమతోపాటు మిగిలిన వ్యక్తులపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా. ఇప్పటికే అతడు ఎన్నో సినిమాలకు వర్క్ చేశాడు. అలాగే బుల్లితెరపై పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. కానీ ఇప్పుడు అతడు ఓ డ్యాన్స్ బృందంతో రూ.11.96 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

రెమో, అతని భార్య కాకుండా, నిందితులుగా ఉన్న ఐదుగురు వ్యక్తులలో ఒక పోలీసు కూడా ఉన్నారు. మిగిలిన నలుగురి పేర్లు ఓంప్రకాష్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవ్, వినోద్ రౌత్, రమేశ్ గుప్తా అని సమాచారం. గతంలో ఓ డ్యాన్స్ గ్రూప్ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొని విజయం సాధించిందని ఆ డ్యాన్సర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ టీమ్ తమదే అని చెబుతూ రెమోతోపాటు మిగిలిన వారు 2018 నుండి 2024 వరకు మొత్తం రూ.11.96 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపించాడు. ప్రస్తుతం ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

రెమో పేరు ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. దాదాపు 8 ఏళ్ల క్రితం కూడా అతడిపై రూ.5 కోట్ల మోసం కేసు నమోదైంది. సినిమా నిర్మాణం పేరుతో తన నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారని, రూ.10 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ అంశంపై 2024 ఆగస్టులో అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. రెమో రిలీఫ్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?