AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతతో నటించొద్దని వారు వార్నింగ్ ఇచ్చారు.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటించింది సమంత. అయితే ఆతర్వాత మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లిపోయింది. కొన్ని నెలల వరకు అక్కడే ఉన్న సామ్ ఇప్పుడు మరో ఆసక్తికర వెబ్ సిరీస్ తో మన ముందుకు రానుంది. అలాగే ఇటీవల ఓ తెలుగు హీరోతో మరో క్రేజీ ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేసింది.

Samantha: సమంతతో నటించొద్దని వారు వార్నింగ్ ఇచ్చారు.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
Samantha
Basha Shek
|

Updated on: Oct 19, 2024 | 6:01 PM

Share

సమంత ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్. బాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి డిమాండ్‌ ఉంది. గతంలో సామ్ నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ బాలీవుడ్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సిరీస్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీనిని కొనసాగిస్తూ ఇప్పుడు మరో వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించనుంది సమంత. వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ మరికొద్ది రోజుల్లో అమెజాన్‌లో విడుదల కానుంది. సమంత, వరుణ్ ధావన్ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వరుణ్ ధావన్.. సమంతపై కొందరు నెగిటివ్‌గా మాట్లాడిన విషయాలను బయట పెట్టాడు. ‘సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. సమంతతో నటించాలని ముందే నిర్ణయించుకున్నాను. ‘సిటాడెల్’ ఆఫర్ వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఆ సమయంలో నాతో కొంత మంది సమంతపై నెగిటివ్ గా మాట్లాడారు. సమంతతో పని చేయవద్దు, ఆమెకు ఆటిట్యూడ్ ఎక్కువ. పైగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. షూటింగ్ కూడా టైమ్ కు పూర్తి చేయదు. మీ పెయిర్ కూడా కుదరదన్నారు. అయితే నేను సమంతతో కలిసి పనిచేస్తానని వారితో చెప్పాను’ అని తెలిపాడు వరుణ్. అయితే సమంతతో నటించవద్దని చెప్పిన వారి పేర్లు బయట పెట్టలేదీ స్టార్ హీరో.

‘సిటాడల్‌’ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభమై చాలా రోజులైంది. దాదాపు మూడేళ్ల క్రితమే ఈ సిరీస్ పట్టాలెక్కింది. అయితే మధ్యలో సమంత అనారోగ్యం పాలు కావడంతో షూటింగ్ పూర్తి కావడానికి మరింత సమయం పట్టింది. కాగా ఆంగ్ల నవల ‘సిటాడెల్’ను రోజ్ సోదరులు ఆంగ్లంలో వెబ్ సిరీస్‌గా రూపొందించారు. ఇందులో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించింది. అదే వెబ్ సిరీస్ ఇటాలియన్ భాషలో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే వెబ్ సిరీస్ హిందీలో కూడా విడుదల కానుంది. కథను యథాతథంగా ఉంచుతూ ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు దర్శకులు రాజ్ అండ్ డీకే. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

సిటా డెల్ వెబ్ సిరీస్  ప్రమోషన్లలో సమంత, వరుణ్ ధావన్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us