AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముక్కు మీద ఏర్పడే నల్లటి గీతలను తొలగించే సులువైన ఇంటి చిట్కాలు! ట్రై చేసి చూడండి..

చాలామందిలో ముక్కు మీద లేదా దాని పక్క భాగంలో చిన్న నల్లటి గీత కనిపిస్తుంటుంది. అలెర్జీలు, సైనస్ సమస్యలు ఉన్నప్పుడు ముక్కును పదే పదే రుద్దడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీనిని ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతులతో తగ్గించుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు బాదం నూనె లేదా కొబ్బరి నూనెతో ముక్కుపై సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. మరిన్ని ఇంటి చిట్కాలు ఇప్పుడు చూద్దాం..

ముక్కు మీద ఏర్పడే నల్లటి గీతలను తొలగించే సులువైన ఇంటి చిట్కాలు! ట్రై చేసి చూడండి..
Dark Line On Nose
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2026 | 1:46 PM

Share

కొందరి ముఖంలో ముక్కు పైభాగంలో లేదా పక్కన ఒక సన్నని నల్లటి గీత లేదా పట్టీలా కనిపిస్తుంటుంది. వైద్యపరంగా దీనిని Allergic crease అని పిలుస్తారు. తరచూ వచ్చే జలుబు, తుమ్ములు లేదా సైనస్ సమస్యల కారణంగా ముక్కును పదే పదే రుద్దడం వల్ల ఈ నల్లటి గీతలు ఏర్పడతాయి. ముఖం అందాన్ని పాడు చేసే ఈ సమస్యను కొన్ని సహజమైన ఇంటి చిట్కాల ద్వారా సులభంగా నివారించవచ్చు.

బాదం నూనెతో మసాజ్:

బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని పునరుద్ధరించడంలో, నల్లటి మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి నిద్రపోవడానికి ముందు కొద్దిగా బాదం నూనెను ముక్కుపై నల్లటి గీత ఉన్న ప్రాంతంలో రాసి, కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి.

అలోవెరా జెల్:

కలబందలో చర్మాన్ని శాంతపరిచే గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై ఏర్పడే నలుపుదనాన్ని, మంటను తగ్గిస్తుంది. తాజా కలబంద గుజ్జును ముక్కుపై రాసి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ ఉదయం మరియు సాయంత్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దోసకాయ రసం:

దోసకాయలో ఉండే నీటిశాతం మరియు విటమిన్లు చర్మానికి మంచి నిగారింపును ఇస్తాయి. దోసకాయను తురిమి రసం తీసి, కాటన్ సహాయంతో ముక్కు చుట్టూ రాయాలి. ఇది ఆరిన తర్వాత మళ్లీ రాస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నల్లటి గీతలు క్రమంగా మరుగైపోతాయి.

ఆయిల్ మసాజ్:

కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను ఉపయోగించి ముక్కు భాగంలో తేలికపాటి వృత్తాకార కదలికలతో మసాజ్ చేయాలి. ఇది ఆ ప్రాంతంలో రక్తప్రసరణను మెరుగుపరిచి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.

తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

అలెర్జీలు రాకుండా ధూళి, పొగ వంటి వాటికి దూరంగా ఉండాలి. ముక్కు దురదగా ఉన్నప్పుడు చేతులతో గట్టిగా రుద్దకుండా, మృదువైన టిష్యూ పేపర్‌ను ఉపయోగించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us