AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుమేహాన్ని నియంత్రించే అద్భుతమైన దేశీయౌషధం…ఈ పూల పొడి ప్రయోజనాలు తెలిస్తే..

సిద్ధ వైద్యుడు డాక్టర్ కామరాజ్ సూచనల ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కానుగ పూవు అద్భుతంగా పనిచేస్తుంది. టైప్-1, టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడంలో ఈ మూలిక ఎంతో సహాయపడుతుంది. కానుగ పూల పొడిని ప్రతిరోజూ ఉదయం, కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా పాటిస్తే, ఎంతగానో పెరిగిన రక్తంలో చక్కెర స్థాయిలు కూడా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

మధుమేహాన్ని నియంత్రించే అద్భుతమైన దేశీయౌషధం...ఈ పూల పొడి ప్రయోజనాలు తెలిస్తే..
Pongamia Flower Powder
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2026 | 8:11 AM

Share

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎంత ప్యూర్ డైట్ పాటించినా, రోజూ మందులు వాడినా కొందరిలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లోకి రావు. అలాంటి వారి కోసం ప్రముఖ సిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ కామరాజ్ ఒక అద్భుతమైన, ఎవరికీ తెలియని ఇంటి వైద్య చిట్కాను వెల్లడించారు. అదే కానుగ పువ్వు పొడి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.

కానుగ పూవు విశేషాలు:

కానుగ చెట్టు మన సంస్కృతిలో ప్రాచీన కాలం నుంచి ఉన్న ఓ సాధారణ చెట్టు. సాధారణంగా ఈ చెట్టు నుంచి లభించే కానుగ నూనెను చర్మవ్యాధులకు, సోరియాసిస్ నివారణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే దీని పూలు మధుమేహ రోగులకు ఒక అమృతంలా పనిచేస్తాయని సిద్ధ వైద్యం చెబుతోంది. ఇది టైప్-1, టైప్-2 అనే రెండు రకాల డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

కానుగ పూవు పొడి తయారుచేసే విధానం:

కానుగ పూలు వికసించే సీజన్‌లో గుత్తులుగా పూలు పూస్తాయి. వాటిని సేకరించాలి. మట్టి, దుమ్ము లేకుండా ఆ పూలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వాటిని నీడలోనే పూర్తిగా ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసి, గాలిచొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఎలా తీసుకోవాలి?:

ఈ కానుగ పూవు పొడిని ప్రతిరోజూ ఉదయం పూట 5 గ్రాములు, అలాగే సాయంత్రం పూట 5 గ్రాముల చొప్పున గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. ఈ మిశ్రమాన్ని ఆహారానికి సుమారు అర గంట ముందే తీసుకోవడం మంచిది.

ఎంత కాలం వాడాలి?:

ఈ పద్ధతిని క్రమం తప్పకుండా 3 నుంచి 6 నెలల పాటు పాటిస్తూ వస్తే, ఎంతగానో పెరిగిన బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా క్రమంగా తగ్గి సాధారణ స్థాయికి వస్తాయని డాక్టర్ కామరాజ్ సూచిస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఈ సహజ సిద్ధమైన ఔషధం మధుమేహ బాధితులకు గొప్ప వరంలాంటిది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మధుమేహాన్ని నియంత్రించే అద్భుతమైన దేశీయౌషధం!ఈ పూల పొడి ప్రయోజనాలు
మధుమేహాన్ని నియంత్రించే అద్భుతమైన దేశీయౌషధం!ఈ పూల పొడి ప్రయోజనాలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
సమంతకు కవల పిల్లలా.?
సమంతకు కవల పిల్లలా.?
మొయినాబాద్‌లో విషాదం.. విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి
మొయినాబాద్‌లో విషాదం.. విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి
టీమిండియాకు బీసీసీఐ షాక్.. తొలి వన్డే తర్వాత నితీశ్ అవుట్
టీమిండియాకు బీసీసీఐ షాక్.. తొలి వన్డే తర్వాత నితీశ్ అవుట్
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపించింది
పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపించింది
మొబైల్ ఛార్జింగ్ బ్యాన్ చేసింది ఇందుకే.. ట్రైన్‌లో మరోసారి పేలిన
మొబైల్ ఛార్జింగ్ బ్యాన్ చేసింది ఇందుకే.. ట్రైన్‌లో మరోసారి పేలిన
బెండకాయ నీరు.. నిజంగానే ఆరోగ్యానికి అంత మంచిదా? డాక్టర్లు చెప్పిన
బెండకాయ నీరు.. నిజంగానే ఆరోగ్యానికి అంత మంచిదా? డాక్టర్లు చెప్పిన
200 దాటితే చేతులెత్తేస్తున్న అభిషేక్.. సాక్ష్యాలివే
200 దాటితే చేతులెత్తేస్తున్న అభిషేక్.. సాక్ష్యాలివే