AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాభిలో నూనె రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలివే!

ఆయుర్వేదంలో నాభి ప్రాంతానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. మన శరీరంలోని 72 వేలకు పైగా నరాలు నాభి కేంద్రంతో కనెక్ట్ అయి ఉంటాయి. అందువల్ల నాభికి తగిన పోషణ అందించడం ద్వారా శరీరం మొత్తం ఆరోగ్యం మెరుగవుతుంది. నాభిలో సరైన నూనెను ఉపయోగించి మసాజ్ చేయడం వల్ల కాంతివంతమైన చర్మం సొంతం చేసుకోవచ్చని, అలాగే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నాభి మసాజ్‌కు ఆయుర్వేదం సిఫారసు చేసే ఆరు ముఖ్యమైన నూనెలు ఇక్కడ ఉన్నాయి.

నాభిలో నూనె రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలివే!
Navel Oil Massage Benefits
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2026 | 1:38 PM

Share

ఆయుర్వేద ప్రకారం మన శరీరంలో నాభి అనేది 72 వేలకు పైగా నరాలతో అనుసంధానించబడి ఉంటుంది. అందుకే నాభిలో కొన్ని చుక్కల నూనె వేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల శరీరం లోపలి నుండి ఆరోగ్యంగా మారడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆముదం, నెయ్యి, మంచి నూనె (నువ్వుల నూనె), ఆవ నూనె, కొబ్బరి నూనె మరియు వేప నూనె వంటి ఆరు రకాల నూనెలను నాభి మసాజ్‌కు ఉపయోగించవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి నిద్రపోయే ముందు ఈ నూనెలను రాయడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది, కీళ్ల నొप्पులు తగ్గుతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఆముదం :

నాభిలో ఆముదం రాసి మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల బిగువు తగ్గుతాయి. ఇందులో ఉండే రిసినోయిక్ ఆమ్లం వాపులను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది.

స్వచ్ఛమైన నెయ్యి:

నాభిలో నెయ్యి రాయడం విచిత్రంగా అనిపించినా, ఇది చర్మానికి అద్భుతమైన తేమను ఇస్తుంది. పొడి చర్మాన్ని నివారించి, హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నెయ్యి చాలా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

నువ్వుల నూనె:

నువ్వుల నూనె శరీరంలో ‘వాత దోషం’ను సమతుల్యం చేస్తుంది. నాభిలో ఈ నూనెను రాయడం ద్వారా నాడీ వ్యవస్థ బలపడి, మానసిక ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

ఆవ నూనె:

క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ గుణాలున్న ఆవ నూనెను నాభిలో మసాజ్ చేయడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పులు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె శరీరానికి సహజమైన చల్లదనాన్ని ఇస్తుంది. నాభిలో కొబ్బరి నూనె రాయడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది, చర్మం లోపలి నుండి తేమను సంతరించుకుని కాంతివంతంగా మారుతుంది.

వేప నూనె:

మొటిమలు, చర్మ సమస్యలతో బాధపడేవారికి వేప నూనె చాలా మంచిది. అయితే దీనిని నేరుగా కాకుండా కొద్దిగా కొబ్బరి నూనెతో కలిపి నాభిలో రాస్తే, శరీంలోని వ్యర్థాలుబయటకుపోయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఎప్పుడు మసాజ్ చేయాలి?

రోజూ రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం స్నానం చేసిన తర్వాత 2-3 చుక్కల నూనెను నాభిలో వేసి, చుట్టూ సున్నితంగా వృత్తాకారంలో మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని, అందమైన చర్మాన్ని పొందవచ్చు.

Follow Us
విద్యార్థులకు గంజాయి సరఫరా.. సెక్యూరిటీ గార్డు అరెస్ట్
విద్యార్థులకు గంజాయి సరఫరా.. సెక్యూరిటీ గార్డు అరెస్ట్
దాబా స్టైల్ ఎగ్‌ మసాలా.. ఇలా చేస్తే ఎన్ని సార్లు తిన్నా..
దాబా స్టైల్ ఎగ్‌ మసాలా.. ఇలా చేస్తే ఎన్ని సార్లు తిన్నా..
నాభిలో నూనె రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?ఆరోగ్య, సౌందర్య లాభాలు
నాభిలో నూనె రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?ఆరోగ్య, సౌందర్య లాభాలు
స్మార్ట్ రింగ్ వర్సెస్ టెంపుల్ డివైజ్.. మానసిక ఒత్తిడిని కొలిచే
స్మార్ట్ రింగ్ వర్సెస్ టెంపుల్ డివైజ్.. మానసిక ఒత్తిడిని కొలిచే
ఏపీకి మరో తుఫాన్ గండం.. ముంచుకొస్తున్న సైక్లోన్..
ఏపీకి మరో తుఫాన్ గండం.. ముంచుకొస్తున్న సైక్లోన్..
వారానికి 2 సార్లు.. ఆలూ ఫేస్ ప్యాక్ రాస్తే చాలు.. కొరియన్స్ లా
వారానికి 2 సార్లు.. ఆలూ ఫేస్ ప్యాక్ రాస్తే చాలు.. కొరియన్స్ లా
దొండకాయ సాగుతో ఈ రైతుకు కాసుల పంట పండింది..
దొండకాయ సాగుతో ఈ రైతుకు కాసుల పంట పండింది..
గురు, రాహువుల అనుగ్రహంతో వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి
గురు, రాహువుల అనుగ్రహంతో వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి
వార్నీ ఇదెక్కడి కచోరీ పిచ్చి.. డబ్బు పోయినా ప్లేట్‌ వదల్లేదు!
వార్నీ ఇదెక్కడి కచోరీ పిచ్చి.. డబ్బు పోయినా ప్లేట్‌ వదల్లేదు!
పేద పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత సీట్లు.. ఇది మీ హక్క
పేద పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత సీట్లు.. ఇది మీ హక్క