కరివేపాకు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

samatha

30 october 2026

Pic credit - Pinterest

ప్రతి ఒక్కరూ కరివేపాకు తింటుంటారు. అయితే ఎక్కువగా సాంబార్, పప్పు చారు, ఇలా కరివేపాకును తింటుంటారు.

కరివేపాకు

కానీ కొంత మంది కరివేపాకు పొడి చేసుకొని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తింటారు. కొందరు జ్యూస్‌లా కూడా తాగుతారు.

ప్రతి రోజూ తినడం

అయితే కరివేపాకు తినడం లేదా జ్యూస్ తాగడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆరోగ్య ప్రయోజనాలు

కాగా, ఇప్పుడు మనం అసలు కరివేపాకు తినడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయి, శరీరానికి దీని వలన ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

ఎలాంటి లాభాలు?

కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఇది  రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ పెరిగి నీరసం, తలతిరుగుడు సమస్యలు తగ్గుతాయి.

రక్తహీనత

రోజూ పరగడుపున కరివేపాకు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం పూర్తిగా తగ్గుతాయి.

జీర్ణక్రియ ఆరోగ్యం

 కరివేపాకులోని బీటా కెరోటిన్, ప్రోటీన్లు జుట్టు రాలడాన్ని ఆపి తెల్ల జుట్టును నల్లగా చేసి జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడుతుంది.

తెల్ల జుట్టు తగ్గిస్తుంది

కరివేపాకులో ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు, బీపీ రిస్క్  తగ్గుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది