AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Masala: దాబా స్టైల్ ఎగ్‌ మసాలా కర్రీ.. ఇలా చేస్తే ఎన్ని సార్లు తిన్నా అస్సలు బోర్ కొట్టదు!

గుడ్డు.. తక్కువ ఖర్చుతో మన శరీరానికి కావాల్సిన ఎక్కవ పోషకాలు అందించే ఏకైక ఆహారం. దీన్ని అనేక రకాలుగా మనం ఆహారంలోకి చేర్చుకోవచ్చు. కొందరు గుడ్లు ఉడకబెట్టి తింటే, మరికొందరు కర్రీ చేసుకుని తింటారు. అయితే రోటీన్‌గా కాకుండా ఈసారి దాబా స్టైల్ పెప్పర్ ఎగ్ మసాలా కర్రీని ట్రై చేయండి. కేవలం రుచికరమైన గ్రేవీని అందించడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరీ దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

Anand T
|

Updated on: Oct 31, 2026 | 1:45 PM

Share
దాబా స్టైల్  పెప్పర్ ఎగ్ మసాలా కర్రీ చేసేందుకు ముందుగా మనం గుడ్లను సరిగ్గా ఉడకబెట్టుకోవాలి. ఇందుకోసం మీరు ముందుగా ఒక గిన్నెలో గుడ్లు మునిగేంత నీటిని తీసుకుని, మూత పెట్టి బాగా మరిగించాలి. తర్వాత అందులో గుడ్లు వేసి ఒక టీస్పూన్ ఉప్పు, ఒక నిమ్మకాయ చెక్క రసం వేయాలి. ఇది గుడ్డు పెంకు సులభంగా వేరుపడటానికి సహాయపడుతుంది. గుడ్డు సొన, పెంకు మధ్య ఉండే సన్నటి పొర పెంకుకు అతుక్కోకుండా చేస్తుంది. ఉడికిన తర్వాత, స్టవ్ ఆపి, గుడ్లను వేడి నీటిలో నుండి తీసి, వెంటనే చల్లని ట్యాప్ నీటిలో వేయాలి. ఇది గుడ్లను చల్లబరచడమే కాకుండా, తొక్కను సులభంగా తీయడానికి దోహదపడుతుంది.

1 / 5
ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం: కర్రీ చేసేందుకు ఒక మిక్సీ జార్‌లో ఒక టీస్పూన్ మిరియాలు, అర టీస్పూన్ సోంపు, ఒక టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి మెత్తగా పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్‌లో మూడు చిన్న లేదా రెండు పెద్ద టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి , కొద్దిగా పుదీనా ఆకులు, పావు కప్పు కొత్తిమీర, 8-10 జీడిపప్పు పలుకులు, రెండు టేబుల్‌స్పూన్ల పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

2 / 5
గుడ్లను వేయించడం: ఇప్పుగు ఒక పాన్‌లో ఒకటి లేదా రెండు టేబుల్‌స్పూన్ల బటర్ వేసి కరిగిన తర్వాత, సగానికి కట్ చేసిన ఉడికించిన గుడ్లను పచ్చసొన కిందికి ఉండేలా పెట్టి, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, తయారుచేసుకున్న మసాలా పొడి, రెండు టేబుల్‌స్పూన్ల చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్‌స్పూన్ కరివేపాకు, ఒక టేబుల్‌స్పూన్ కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్‌లో 5-10 నిమిషాలు రెండు వైపులా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టాలి.

3 / 5
గ్రేవీ తయారీ: ఇప్పుడు ఒక కడాయిలో మూడు నుండి నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీ అంత చిక్కగా ఉంటుంది. రెండు టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తయారుచేసుకున్న గ్రేవీ పేస్ట్‌ను వేసి, నూనె పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించాలి. రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ గరం మసాలా పొడి, ముందుగా తయారుచేసుకున్న మసాలా పొడి మొత్తం వేసి అర నిమిషం పాటు వేయించాలి.

4 / 5
ఇప్పుడు ఒక కప్పు నీళ్లు పోసి, ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. అప్పుడు గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న గుడ్లు, రెండు చీల్చిన పచ్చిమిర్చి, ఒక టీస్పూన్ కసూరీ మేతి, రెండు టేబుల్‌స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెండు నుండి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించి స్టవ్ ఆపివేయాలి. గుడ్లు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. కొద్ది సేపు పెట్టి తీస్తే సరిపోతుది. మీ దాబా స్టైల్ ఎగ్‌ మసాలా కర్రీ రెడీ అయినట్టే. ఈ కూర బిర్యానీ, చపాతీ, పుల్కా లేదా రైస్‌తో అద్భుతమైన కాంబినేషన్‌గా ఉంటుంది.

5 / 5
Follow Us