AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ నటి.. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా జిల్లా కలెక్టర్

సినిమా ఇండస్ట్రీలో కొందరు నటీనటులు చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వరుస సినిమాలు, టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరవుతారు. అయితే కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే అనూహ్యంగా సినిమాలకు దూరమై మరో రంగంలో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ హెచ్.ఎస్. కీర్తన ఒకరు.

Rajeev Rayala
|

Updated on: Oct 31, 2026 | 1:44 PM

Share
సినిమా ఇండస్ట్రీలో కొందరు నటీనటులు చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వరుస సినిమాలు, టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరవుతారు. అయితే కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే అనూహ్యంగా సినిమాలకు దూరమై మరో రంగంలో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ హెచ్.ఎస్. కీర్తన ఒకరు. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె.. ఇప్పుడు ఐఏఎస్ అధికారిణిగా ప్రజలకు సేవలందిస్తున్నారు. 32 సినిమాలు, 48 టెలివిజన్ షోలలో భాగమైన ఆమె ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

1 / 5
కర్ణాటకలోని తుమకూరు జిల్లా హోసకేరె గ్రామంలో జన్మించిన హెచ్.ఎస్. కీర్తనకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. దీంతో కేవలం నాలుగేళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. బాలనటిగా కెమెరా ముందుకు వచ్చిన ఆమె తన సహజమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కీర్తన కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. తన కెరీర్‌లో సుమారు 32 సినిమాల్లో నటించారు. ‘కర్పూరద గొంబె’, ‘గంగ-యమున’, ‘ముద్దిన అలియ’, ‘ఉపేంద్ర’, ‘ఏ’, ‘కానూరు హెగ్గడితి’, ‘సర్కిల్ ఇన్‌స్పెక్టర్’, ‘లేడీ కమిషనర్’, ‘హబ్బా’, ‘దోరె’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

2 / 5
 వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా కీర్తన తన ప్రతిభను చూపించారు. దాదాపు 48 టెలివిజన్ షోలు, సీరియల్స్‌లో నటించారు. ‘జనని’, ‘చిగురు’, ‘పుట్టాని ఏజెంట్’ వంటి కార్యక్రమాలతో టీవీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అలా చిన్న వయసులోనే సినిమా, టెలివిజన్ రంగాల్లో మంచి అనుభవాన్ని సంపాదించారు. వరుస అవకాశాలతో కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే కీర్తన తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలు, టీవీ షోలకు దూరమై చదువుపై దృష్టి పెట్టారు. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు.

3 / 5
నటనకు బ్రేక్ ఇచ్చిన తర్వాత కీర్తన కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (KAS) పరీక్షకు సిద్ధమయ్యారు. 2011లో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ అధికారిణిగా బాధ్యతలు చేపట్టారు. సుమారు రెండేళ్లపాటు KAS అధికారిగా పనిచేశారు. అయితే ఆమె లక్ష్యం మాత్రం ఐఏఎస్ కావడమే. ఐఏఎస్ కావాలనే కలతో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమైన కీర్తనకు ప్రారంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. వరుసగా ఐదుసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని వదులుకోకుండా మరోసారి పరీక్షకు సిద్ధమయ్యారు.

4 / 5
చివరకు ఆరో ప్రయత్నంలో కీర్తన తన కలను నిజం చేసుకున్నారు. 2020లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 167వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారిణిగా ఎంపికయ్యారు. ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొని సాధించిన ఈ విజయం ఆమె జీవితంలో అతిపెద్ద మలుపుగా నిలిచింది. ఐఏఎస్ శిక్షణ పూర్తయ్యాక కర్ణాటకలోని మాండ్య జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్‌గా తొలి కీలక బాధ్యతలు చేపట్టారు. అక్కడ అధికారిణిగా పనిచేస్తూ పరిపాలనా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. హెచ్.ఎస్. కీర్తన ప్రస్తుతం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా విధులు నిర్వహిస్తున్నారు. 

5 / 5
Follow Us